India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం ప.గో(D) నరసాపురం. 1991లో PV నరసింహారావు GOVT ప్రమాదంలో పడగా.. TDP MP భూపతిరాజు విజయకుమార్ రాజు ఐదుగురు MPలతో కలిసి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కాపాడి సంచలనం సృష్టించారు. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు క్షత్రియ సామాజికవర్గం వారే గెలిచారు. ఈసారి ఇక్కడ BJP భూపతిరాజు శ్రీనివాస వర్మను బరిలోకి దింపింది. ఉమాబాలను YCP పోటీ చేయిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
IPLలో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం ముంబై 11 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. మిగిలిన 3 మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. అప్పుడు 12 పాయింట్స్ వస్తాయి. SRH (12 పాయింట్లు), లక్నో (12 పాయింట్లు) మిగతా మ్యాచులు ఓడిపోవాలి. అంతేకాదు RR, KKR కాకుండా మిగిలిన అన్ని జట్లు 12 పాయింట్లు సాధించకూడదు. వీటితో పాటు NRR కూడా ఎక్కువగా ఉంటే హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
బిగ్‌బాస్ ఓటీటీ 2 విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రేవ్ పార్టీలు నిర్వహించి పాము విషాన్ని పంపిణీ చేసిన కేసులో ఎల్విష్ నిందితుడిగా ఉన్నాడు. మార్చి 17న నోయిడా పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా తాజాగా ఈడీ మనీలాండరింగ్ కేసుతో దర్యాప్తు ముమ్మరం చేసింది. రేవ్ పార్టీలతో వచ్చిన నిధులు ఎటు మళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనుంది.
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ చిత్రం తెలుగులోనూ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి చిదంబరం దర్శకత్వం వహించారు. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
టాలీవుడ్, బాలీవుడ్ డైలాగ్‌లకు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసే DC ప్లేయర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు ప్లేయర్ జేక్ ఫ్రేజర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కోసారి అతడిని చూస్తుంటే నాకు భారతీయుడిగానే కనిపిస్తారు. అందుకే వార్నర్ 70 శాతం ఇండియన్, 30 శాతం ఆస్ట్రేలియన్ అని చెబుతా. నేను కలిసిన వ్యక్తుల్లో అతను నిస్వార్థ ప్లేయర్. సాయం చేయడానికి 24/7 అందుబాటులో ఉంటారు’ అని కొనియాడారు.
ఈసీ నిబంధనల ప్రకారం MP అభ్యర్థి గరిష్ఠంగా ₹95 లక్షలు, MLA అభ్యర్థి ₹40 లక్షలు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఉంది. వాస్తవంగా ఆ ఖర్చు రూ.కోట్లలో ఉంటోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీళ్లలా పారుతోన్న నోట్ల కట్టలు కళ్ల ముందే కనిపిస్తున్నా సరైన చర్యలు ఉండట్లేదు. ఈ విపరీత వ్యయాన్ని నిలుపుదల చేయకపోతే తీవ్ర ప్రమాదమని, గెలిచిన అభ్యర్థుల అవినీతిని పెంచి పోషించడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశం అందరికీ సమానంగా కల్పించాలనే ఉద్దేశంతో వ్యయ పరిమితిని EC విధించింది. 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో గరిష్ఠంగా ₹25వేలు, చిన్న రాష్ట్రాల్లో ₹10వేలు. యాడ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, వాహనాల వినియోగం ఇందులోకే వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని EC వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్‌సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుకు లిమిట్ ఉంది కానీ పార్టీలకు లేదు. 2019 ఎన్నికల్లో BJP ₹1,264 కోట్లు, INC ₹820 కోట్లు వ్యయం చేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి పార్టీలు, అభ్యర్థులు చేసిన ఖర్చు ₹60,000 కోట్లు పైనేనని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్(CMS) నివేదిక వెల్లడించింది. ఈ LS ఎన్నికల్లో అనధికార ఖర్చు ₹1.2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఒక్కో సెగ్మెంట్ సగటు వ్యయం ₹221 కోట్లు.
<<-se>>#ELECTIONS2024<<>>
భారత్ ‘xenophobic’ (విదేశీయులంటే భయపడటం) అని US అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. ‘భారత్ ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటోందన్న ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదు. భారత్ జెనోఫోబిక్ కాదు. ప్రపంచ చరిత్రలో వివిధ వ్యక్తులు, సమాజాలను స్వాగతించే దేశాల్లో భారత్‌ది ప్రత్యేకమైన స్థానం. అందుకే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఏఏ తెచ్చాం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.