news

News May 8, 2024

పిటిషన్‌ వేసినందుకు రూ.లక్ష ఫైన్

image

సీఎం బాధ్యతల నిర్వహణ కోసం కేజ్రీవాల్ జైలులో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్ వేసినందుకు ఢిల్లీ హై కోర్టు రూ.లక్ష ఫైన్ వేసింది. జైలులో సీఎం కార్యాలయ నిర్వహణ సాధ్యం కాదంటూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. శ్రీకాంత్ ప్రసాద్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం వెలువడనుంది.

News May 8, 2024

అశ్విన్ నుంచి చాలా నేర్చుకున్నా: కుల్‌దీప్

image

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నుంచి చాలా నేర్చుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తెలిపారు. ప్రణాళికల విషయంలో ఇబ్బందిగా ఉంటే అశ్విన్‌తో మాట్లాడుతుంటానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిన్న RRvsDC మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 400కు పైగా పరుగుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ కేవలం 25 పరుగులిచ్చి 2 వికెట్లను తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నారు.

News May 8, 2024

ఏపీకి బుల్లెట్ రైలు కావాలా? వద్దా?: మోదీ

image

ఏపీకి బుల్లెట్ రైలు కావాలా? వద్దా? అని ప్రధాని మోదీ పీలేరు సభలో ప్రజలను ప్రశ్నించారు. ‘దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం. కడప ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తాం. టమాటా నిల్వ చేసేందుకు భారీగా గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు.

News May 8, 2024

ధోనీలా యానిమేటేడ్ బాహుబలి.. రాజమౌళి రియాక్షన్ ఇదే

image

దర్శకుడు రాజమౌళి ధోనీకి ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన బాహుబలి యానిమేటేడ్ సిరీస్‌లో బాహుబలి క్యారెక్టర్ ఫేస్ కట్ ధోనీని పోలి ఉన్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ధోనీ అంటే ఇష్టంతోనే బాహుబలి క్యారెక్టర్ ఫేస్ మిస్టర్ కూల్‌ని పోలి ఉందా? అని రాజమౌళిని యాంకర్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. ఆ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసిన వారు కూడా తన‌లాగే ధోనీ ఫ్యాన్స్ అని జక్కన్న బదులిచ్చారు.

News May 8, 2024

IPL: మ్యాచ్ రద్దయితే!

image

ఉప్పల్‌లో ఇవాళ జరగాల్సిన హైదరాబాద్‌, లక్నో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ మొదలైనా వరుణుడి కారణంగా పూర్తి స్థాయిలో జరుగుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇరు జట్లకు మూడు మ్యాచ్‌లే మిగిలున్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఈ పోరు కీలకంగా మారింది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అదే జరిగితే హైదరాబాద్‌ 13 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకుంటుంది.

News May 8, 2024

దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది: మోదీ

image

AP: దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా ఆ పార్టీ సిద్ధమైంది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. భారత్.. విభిన్న జాతుల సమూహం. గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి(పిట్రోడా) మాట్లాడే ఇలాంటి మాటలు వింటుంటే సిగ్గేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

News May 8, 2024

అన్ని మాఫియాలకు ట్రీట్‌మెంట్ ఇస్తాం: మోదీ

image

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని మాఫియాలకు పక్కాగా ట్రీట్‌మెంట్ ఇస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘కేంద్ర పథకం జల్‌జీవన్ మిషన్‌కు YCP ప్రభుత్వం సహకరించలేదు. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా నీళ్లు అందించాలనే లక్ష్యాన్ని నీరుగార్చింది. AP ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. YCP మంత్రులు గూండాయిజం చేస్తున్నారు’ అని విమర్శించారు.

News May 8, 2024

సినిమాల్లోని పాపులారిటీ తక్షణమే ఓట్లను తీసుకురాదు: పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోని పాపులారిటీ తక్షణమే ఓట్లను తీసుకురాదని అన్నారు. ఒక్క రంగంలో ఫేమస్ అయినంత మాత్రాన వేరే రంగంలోనూ అలాగే ఉంటుందని చెప్పలేమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బీజేపీ యాంటీ ముస్లిం కాదని చెప్పారు. కాషాయ పార్టీకి ఏ కమ్యూనిటీపై వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. కాగా వైసీపీ పాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్నారు.

News May 8, 2024

పోలింగ్ రోజున ఈసీ కల్పించే సౌకర్యాలు..

image

➥దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం. BLOలను సంప్రదిస్తే ఆటో ద్వారా ఓటర్లను తరలించే ఏర్పాట్లు చేస్తారు.
➥ఓటర్ల సహాయార్థం NCC, NSS, స్కౌట్స్‌ని వాలంటీర్లుగా నియామకం
➥పోలింగ్ బూత్‌లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం. ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్స్
➥చిన్నపిల్లల కోసం శిశుసంరక్షణ కేంద్రం
➥మహిళలు, పురుషులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు. కొన్ని చోట్ల మహిళల కోసం ప్రత్యేక బూత్‌లు.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 8, 2024

శామ్ పిట్రోడాపై నిర్మల ఫైర్

image

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా <<13205842>>వ్యాఖ్యలపై<<>> కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘నేను సౌతిండియాకు చెందిన వ్యక్తినైనా భారతీయురాలినే. నా టీమ్‌లో కొందరు వివిధ ప్రాంతాలకు చెందినవారైనా భారతీయులుగానే కనిపిస్తారు. కానీ రాహుల్ గాంధీ మెంటార్(శామ్ పిట్రోడా)కు మాత్రం మేమంతా ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బుల్లా కనిపిస్తున్నాం. మీ మైండ్‌సెట్‌ను తెలియజేసినందుకు థాంక్స్. షేమ్ I.N.D.I కూటమి’ అని ఫైర్ అయ్యారు.