India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 2న ఆయన తిరిగి జైలుకు రావాలని కోర్టు సూచించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజైన జూన్ 5 వరకు బెయిల్ కావాలని కోరారు. కానీ.. ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. జూన్ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్ పార్టీ 70ఏళ్ల పాటు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే.. మోదీ 5ఏళ్లలోనే ఆలయాన్ని నిర్మించారని అన్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే రామ మందిర ప్రారంభోత్సవానికి రాలేదని ఆరోపించారు.
గత కొంతకాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ‘గో ఫస్ట్’ విమానయాన సంస్థ ఇప్పుడు దివాలా తీసే స్థితికి చేరింది. డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల్లో ఈ సంస్థకు చెందిన స్లాట్లు, ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రైట్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని DGCA భావిస్తోందట. గత ఏడాదిగా ఈ స్లాట్స్‌ను సంస్థ వినియోగించుకోకపోవడమే కారణమని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే గో ఫస్ట్ స్లాట్స్‌ను ఇతర సంస్థలు వినియోగించుకుంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కాగా.. కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.
AP: ప్రజలను భయపెట్టి చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్ట విరుద్ధమని చంద్రబాబు కేంద్రంతో చెప్పించగలరా? అని సవాల్ విసిరారు. పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్న బాబును తిట్టడానికి మాటలు కూడా రావడం లేదని తీవ్రస్థాయిలో స్పందించారు. దొంగ స్టాంప్ పేపర్లకు చెక్ పెట్టాలనే ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు సజ్జల తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిన్న పద్మవిభూషణ్ అందుకున్న ఆయన తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకు భారతరత్నపై ఆలోచించాలి’ అని సూచించారు. ‘మీరు ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు కదా?’ అని మీడియా ప్రశ్నించగా.. చిరు నవ్వుతూ వెళ్లిపోయారు.
ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్ తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య హేలీ బీబర్ గర్భం దాల్చినట్లు అతను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. హేలీ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. వీరికి 2018లో వివాహమైంది. బీబర్ రూపొందించిన బేబీ, లెట్ మీ లవ్ యూ, మై వరల్డ్ 2.0 వంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20(8)లో సర్వీస్ ఓటరు గురించి నిర్వచించారు. సాయుధ దళాల్లో పనిచేసే ఉద్యోగులు, రాష్ట్రం, దేశం వెలుపల విధులు నిర్వహించే ఉద్యోగులను సర్వీస్ ఓటర్లుగా పిలుస్తారు. కాగా సాయుధ దళాల్లో పని చేసే ఉద్యోగులు వేరే ప్రదేశంలో విధుల్లో ఉంటే తమ బదులు వేరే వ్యక్తిని ఓటు వేసేందుకు నియమించుకోవచ్చు. అలాంటి సమయాల్లో సర్వీస్ ఓటర్లను క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు.
2022లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సీజన్‌లోనే టైటిల్ కొట్టి, 2వ సీజన్‌లో ఫైనలిస్టుగా నిలిచి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ ఈరోజు చావోరేవో మ్యాచ్ ఆడనుంది. చెన్నైతో జరిగే ఈ మ్యాచ్‌లో GT ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్న GT తర్వాత మ్యాచుల్లో KKR, SRH వంటి టఫ్ జట్లతో తలపడాల్సి ఉంది. సో, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గుజరాత్ ఇంటికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని చంద్రబాబు అన్నారు. ‘మీ భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యాడు. ఇలాంటి చట్టాలకు సంబంధించిన పత్రాలు రేపు సాయంత్రం తగులబెట్టండి. ఇళ్లు లేనివారికి ఇళ్లు ఇస్తాం. పట్టాదారుపుస్తకాలపై జగన్ బొమ్మ కాదు.. రాజముద్ర వేయిస్తా. మీ భూమి పదిలంగా ఉండాలంటే కూటమికి ఓటేయండి. కూటమి అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు ఇస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచను’ అని హామీనిచ్చారు.
Sorry, no posts matched your criteria.