News September 19, 2024
వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్
TG: రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News October 4, 2024
పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పరోక్ష ట్వీట్
నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్న వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ‘నేనో పెద్ద సనాతన హిందువుని’ అని పవన్ ప్రకటించారు.
News October 4, 2024
వారం రోజులకు ‘దేవర’ కలెక్షన్లు ఎంతంటే?
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
News October 4, 2024
అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న దేశాలు!
CEO వరల్డ్ మ్యాగజైన్ విడుదల చేసిన హెల్త్ కేర్ ఇండెక్స్-2024 ప్రకారం 100కి 78.72 స్కోరుతో తైవాన్ దేశం అత్యుత్తమ వైద్య సదుపాయాలను కలిగి ఉంది. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటుపై సర్వే చేసి ప్రతి దేశానికి స్కోరునిచ్చారు. దక్షిణ కొరియా(77.7), ఆస్ట్రేలియా(74.11), కెనడా(71.32), స్వీడన్(70.73) టాప్-5లో ఉన్నాయి. కాగా, ఇండియాకు 45.84 స్కోర్ లభించింది.