news

News September 19, 2024

గూఢచార సంస్థ మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

హెజ్బొల్లా పేజ‌ర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కి ఘ‌న చ‌రిత్రే ఉంది. 1976లో ఉగాండాలో 102 మంది బందీల విడుద‌లకు ఆప‌రేష‌న్ ఎంటెబ్బా చేపట్టింది. త‌మ అథ్లెట్ల‌ను హ‌త్య చేసిన వారిని వివిధ దేశాల్లో వెంటాడి చంపింది. ఐచ్మాన్, ఒపేరా, మొసెస్‌, డైమండ్‌, ప్లంబ‌ట్‌, స‌బేనా వంటి అనేక ఆపరేషన్లు చేపట్టింది. శత్రు దుర్భేద్యమైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మొస్సాద్ బలం.

News September 19, 2024

జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.

News September 19, 2024

టూరిజాన్ని గాడినపెట్టేందుకు కృషి: మంత్రి దుర్గేశ్

image

AP: రాష్ట్రంలో టూరిజాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. వచ్చే నెల 15 కల్లా టూరిజంపై DPR రూపొందించి కేంద్రానికి ఇస్తామని మీడియాతో తెలిపారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు సహకరిస్తామని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

News September 19, 2024

చెప్పిన తేదీకే మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల

image

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తోన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘విశ్వంభర’ సంక్రాంతికి రిలీజ్ అవనుంది. అయితే, మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని, అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.

News September 19, 2024

ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల

image

AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.

News September 19, 2024

సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.

News September 19, 2024

పోలీసుల అదుపులో జానీ మాస్టర్

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.

News September 19, 2024

మోదీనే నం.1

image

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిచూపుతారు. ఈ ఏడాది Xలో జనవరి – ఆగస్టు వరకు అత్యధిక మంది మాట్లాడుకున్న వ్యక్తిగా మోదీ నిలిచారు. ఆయన తర్వాత విరాట్ కోహ్లీ(2), రోహిత్ (3), విజయ్ (4), యోగీ ఆధిత్యనాథ్ (5), రాహుల్ గాంధీ (6), ధోనీ (7), షారుఖ్ ఖాన్(8), పవన్ కళ్యాణ్ (9), ఎన్టీఆర్ (10) ఉన్నారు.

News September 19, 2024

చరణ్- బుచ్చిబాబు.. మరో ‘రంగస్థలం’ కానుందా?

image

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్‌ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్‌లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్‌ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News September 19, 2024

ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం

image

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.