news

News May 11, 2024

హనుమాన్ విలన్‌తో హీరోయిన్ లవ్?

image

హనుమాన్ సినిమాలో విలన్‌గా చేసిన వినయ్ రాయ్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హీరోయిన్ విమలా రామ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరూ చేసిన ట్రెండీ ఫొటో షూట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రేమాయణంపై వీరు అధికారికంగా ప్రకటించలేదు. విమలా రామన్ తెలుగులో ఎవరైనా ఎపుడైనా, గాయం-2, చట్టం, నువ్వా నేనా, రాజ్, డామ్ 999 తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

News May 11, 2024

KKRతో మ్యాచ్.. ముంబై టార్గెట్ 158 రన్స్

image

వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో KKR 157/7 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 42, నితీశ్ రాణా 33, రస్సెల్ 24, రింకూ సింగ్ 20 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా చెరో రెండు వికెట్లు, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషారా చెరో వికెట్ తీశారు.

News May 11, 2024

సిబ్బంది‌కి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఇదే..

image

✒ 12న సా.4కు సమోసా, మజ్జిగ, సా.5కు మజ్జిగ లేదా నిమ్మరసం
✒ రాత్రి 7-8 మధ్య భోజనం(అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ)
✒ 13న ఉదయం టీ, రెండు అరటి పండ్లు, ఉప్మా, పల్లీ చట్నీ(మధ్యలో మజ్జిగ)
✒ మధ్యాహ్నం అన్నం, కోడి గుడ్డు, ఓ వెజిటబుల్ కర్రీ, చట్నీ, సాంబారు, పెరుగు
✒ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మజ్జిగ, నిమ్మరసం
✒ సా.5.30కు టీ, బిస్కెట్లు
<<-se>>#ELECTIONS2024<<>>

News May 11, 2024

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవాళ అత్యధికంగా నంద్యాల(D) చాగలమర్రి, విజయనగరం(D) రాజాం, వైఎస్సార్(D) సింహాద్రిపురంలో 41.5 డిగ్రీలు, అల్లూరి(D) యెర్రంపేటలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.

News May 11, 2024

గవర్నర్ వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది: మమతా బెనర్జీ

image

పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల గవర్నర్ పౌరులకు చూపించిన వీడియో ఎడిటెడ్ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను మొత్తం ఫుటేజీ చూశానని.. అందులో దిగ్భ్రాంతికి గురిచేసే దృశ్యాలున్నాయని చెప్పారు. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ తన దగ్గర ఉందని తెలిపారు. ఆయన రాజీనామా చేసే వరకు రాజ్ భవన్ కు వెళ్లనని తేల్చి చెప్పారు.

News May 11, 2024

BREAKING: మే 14న వారికి సెలవు

image

AP: మే 13న జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ సెలవు వర్తిస్తుంది. విధులకు హాజరైన రిజర్వ్‌డ్, డ్రాఫ్ట్ చేయబడిన సిబ్బందికి ఈ సెలవు వర్తించదు. కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలి’ అని ఆయన ఆదేశించారు.

News May 11, 2024

ఈ సారి 83% పోలింగ్ ఆశిస్తున్నాం: ముకేశ్ కుమార్ మీనా

image

AP: ఈ సారి ఎన్నికల్లో 83% పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గత ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. పోలింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News May 11, 2024

ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(2/3)

image

✒ పోలింగ్ కేంద్రాలు-46,389; సున్నితమైన బూత్‌లు- 12,459
✒ సమస్యాత్మక సెగ్మెంట్లు- 14(100% వెబ్‌కాస్టింగ్)
మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె
✒ పోలింగ్ సిబ్బంది-3.30 లక్షలు; ✒ పోలీసులు-1.14లక్షలు
✒ సెక్టార్ అధికారులు- 10,000; ✒ మైక్రో అబ్జర్వర్లు- 8,961
<<-se>>#ELECTIONS2024<<>>

News May 11, 2024

ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే!(1/3)

image

✒ అసెంబ్లీ సీట్లు- 175; లోక్‌సభ స్థానాలు-25
✒ మొత్తం ఓటర్లు- 4.14 కోట్ల మంది
✒ పురుషులు-2.3 కోట్లు; మహిళలు-2.10 కోట్లు
✒ థర్డ్ జెండర్ 3,421; సర్వీస్ ఓటర్లు 68,185
✒ 169 సెగ్మెంట్లలో ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్
✒ అరకు, పాడేరు, రంపచోడవరంలో సా.4 వరకు పోలింగ్
✒ పాలకొండ, కురుపాం, సాలూరులో సా.5వరకు పోలింగ్
✒ ఆ సమయంలోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం <<-se>>#ELECTIONS2024<<>>

News May 11, 2024

ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(3/3)

image

లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్‌సభలో అత్యధికంగా 33 మంది, రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్‌ జరిగే అవకాశముందని అంచనా.
<<-se>>#ELECTIONS2024<<>>