News September 19, 2024

ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Similar News

News October 3, 2024

‘వైవాహిక అత్యాచారం’ పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్రం

image

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు ‘అత్యాచారాన్ని’ మినహాయించే ప్రస్తుత ఉన్న చట్టాలను సమర్థించింది. వివాహిత అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కంటే సామాజిక ఆందోళన అని, ఈ విష‌యంలో నిర్ణయం తీసుకొనే ముందు విస్తృత చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంద‌ని పేర్కొంది. వివాహాన్ని సమాన బాధ్యతలు కలిగిన బంధంగా పరిగణిస్తారంది.

News October 3, 2024

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త‌

image

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 78 రోజుల బోన‌స్ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం రైల్వే శాఖ‌లో ప‌నిచేస్తున్న సుమారు 11.72 ల‌క్ష‌ల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌కు ప‌నితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోన‌స్‌ ల‌భించ‌నుంది. అర్హత ఉన్న ప్ర‌తి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గ‌రిష్ఠంగా రూ.17,951 చెల్లించ‌నున్నారు.

News October 3, 2024

ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

image

గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞ‌ప్తి చేశార‌న్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.