news

News September 19, 2024

యువ CA మృతిపై కేంద్రం విచారణ

image

ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.

News September 19, 2024

అట్లీతో తప్పకుండా సినిమా చేస్తా: NTR

image

‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీతో తీసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘అట్లీ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారు. రొమాంటిక్ కామెడీ స్టోరీని కూడా డిస్కస్ చేశాం. తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ, తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా తీస్తాం. ఆయన తీసిన రాజా-రాణి అంటే నాకెంతో ఇష్టం’ అని ఎన్టీఆర్ తెలిపారు.

News September 19, 2024

వ్యర్థాల తొలగింపుపై హైడ్రా కీలక నిర్ణయం

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆఫ్‌లైన్‌లో బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.

News September 19, 2024

జానీ మాస్టర్ అరెస్ట్.. నాగబాబు ట్వీట్లు వైరల్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అరెస్టు నేపథ్యంలో జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్లు చేశారు. చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్‌ను పోస్ట్ చేశారు. మీరు వినేదే నమ్మొద్దని, ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు. దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. అత్యాచార కేసు నమోదవ్వడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసింది.

News September 19, 2024

వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

News September 19, 2024

బీజేపీ-కాంగ్రెస్ మ‌ధ్య లేఖ‌ల యుద్ధం

image

PM మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాయడంపై BJP అధ్యక్షుడు నడ్డా విమర్శలు గుప్పించారు. ‘మీ విఫలమైన ఉత్పత్తి(రాహుల్ గాంధీ)ని ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు. అయినా మీ రాజకీయ అవసరాలకు పాలిష్ చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. అందుకే మీరు PMకి లేఖ రాశారు’ అని నడ్డా దుయ్య‌బట్టారు. రాహుల్ గాంధీ నంబ‌ర్ వ‌న్ ఉగ్ర‌వాది అని కేంద్ర మంత్రి రవ్‌నీత్ చేసిన‌ వ్యాఖ్యలను తప్పుబడుతూ PMకి ఖర్గే లేఖ రాశారు.

News September 19, 2024

లడ్డూ నాణ్యతపై సీఎం వ్యాఖ్యలు నిజమే: రమణ

image

AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు <<14134836>>వ్యాఖ్యలు<<>> నిజమేనని TTD మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ చెప్పారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతలు ఇచ్చారని మీడియాకు తెలిపారు. వైవీ, భూమన, ధర్మారెడ్డి తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

News September 19, 2024

9 ఏళ్లకే యాప్.. 13 ఏళ్లకే సొంత కంపెనీ!

image

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత కేరళకు చెందిన ఆధిత్యన్ రాజేశ్‌కు సరితూగుతుంది. 9 ఏళ్లకే మొదటి మొబైల్ యాప్‌ని సృష్టించాడు. 13 ఏళ్లకే సైట్స్, లోగోస్ క్రియేట్ చేసే కంపెనీ స్థాపించాడు. తోటివారు ఖాళీ సమయంలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఇతను సాఫ్ట్‌వేర్‌పై ట్రైనింగ్ తీసుకున్నాడు. తాను స్థాపించిన ట్రినెట్ సొల్యూషన్స్‌ని పాఠశాల స్నేహితుల సహాయంతో నడిపిస్తున్నాడు. అతని కంపెనీకి 12 మంది క్లయింట్స్ ఉన్నారు.

News September 19, 2024

ఆయన డాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్: ఎన్టీఆర్

image

తమిళ హీరో విజయ్ డాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని ఎన్టీఆర్ అన్నారు. అతి చూపించకుండా ఉండాలని, విజయ్ స్టెప్పులు కూల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయని చెప్పారు. డాన్స్ అనేది ఫైట్, జిమ్నాస్టిక్స్ చేసినట్లుగా ఉండొద్దన్నారు. శ్రమపడనట్లుగా డాన్స్ ఉండాలని విజయ్ అలాగే చేస్తారని కొనియాడారు. అప్పట్లో తామిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు. కాగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ ఈ నెల 27న విడుదల కానుంది.

News September 19, 2024

విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన

image

TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్‌కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.