news

News May 14, 2024

కాలువలకు మరమ్మతులు చేపట్టాలి: పవన్ కళ్యాణ్

image

ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎన్నికలు ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి, మరమ్మతుల పనులను వేసవి ముగిసేలోగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు.

News May 14, 2024

CBNపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

image

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ 2010లో నమోదైన కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో 2010లో బాబును MH పోలీసులు అరెస్ట్ చేసి ధర్మాబాద్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ కేసులో CBN, ఆనంద్ బాబుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

News May 14, 2024

సీఎం విదేశీ పర్యటనపై నేడు తీర్పు

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News May 14, 2024

గాజాలో యూఎన్ భారత సిబ్బంది మృతి!

image

ఇజ్రాయెల్ దాడిలో ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రతా విభాగంలో పనిచేస్తున్న భారత సిబ్బంది మరణించారు. గాజాలోని రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరగడంతో మరణించినట్లు పీటీఐ పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్ అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి. రఫాలో తలదాచుకున్న పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

News May 14, 2024

ఐపీఎల్: SRH, RCB ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే?

image

☛ SRH 12 మ్యాచుల్లో 7 నెగ్గింది. మిగతా 2 మ్యాచుల్లో(GT, PBKS) గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. NRR(+0.406) కూడా బాగుంది. ఒకటి గెలిచినా ముందుకు వెళ్లే ఛాన్సుంది. రెండింట్లో ఓడితే ఇతర మ్యాచుల ఫలితాలపై ఆధారపడాలి.
☛ RCB 13 మ్యాచుల్లో 6 నెగ్గింది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే SRH, LSG, DCలో రెండు జట్లు నిష్క్రమించాలి. CSKతో మ్యాచులో RCB 18 రన్స్ తేడాతో గెలవాలి. లేదా టార్గెట్‌ను 18.1ఓవర్లలో ఛేదించాలి.

News May 14, 2024

HYD మెట్రో.. నిన్న అలా.. నేడు ఇలా!!

image

TG: ఎన్నికల్లో ఓటు వేసి తిరిగొస్తున్న వారితో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. ముఖ్యంగా ఎల్బీ నగర్-మియాపూర్ లైన్ కిటకిటలాడుతోంది. ఇవాళ డ్యూటీలు ఉండటంతో చాలా మంది ఉదయం పూటే తిరిగివస్తున్నారు. నిన్న బోసిపోయి కనిపించిన అమీర్ పేట మెట్రో స్టేషన్.. నేడు ప్రయాణికుల రద్దీతో జాతరను తలపిస్తోంది. దీంతో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు సమాచారం.

News May 14, 2024

వారి ఫలితాలు జూన్ 4న వస్తాయి: శశి థరూర్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా జూన్ 4వ తేదీన తేలనున్న ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘10వ తరగతి చదివిన వారి ఫలితాలు నిన్ననే వచ్చాయి. 12వ తరగతి చదివిన వారి ఫలితాలు రేపు విడుదలవుతాయి. కానీ, ఏమీ నేర్చుకోని వారి ఫలితాలు జూన్ 4న వస్తాయి’ అని సెటైర్లు వేశారు. ఆయన ఎవరిని ఉద్ధేశించి ఈ ట్వీట్ చేశారో కామెంట్ చేయండి.

News May 14, 2024

ALERT: ఈనెల 17 వరకు వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో, రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. HYDలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News May 14, 2024

తొలి 6G డివైజ్‌ను ఆవిష్కరించిన జపాన్

image

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్‌ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్‌తో పోలిస్తే ఈ డివైజ్(నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.

News May 14, 2024

ఏపీలో ఎవరు గెలుస్తారు?

image

ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఫలితాలు ఎలా వస్తాయనే ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో వైసీపీ, ఎన్డీయే కూటములు విజయంపై ధీమాగా ఉన్నాయి. #TDPJSPBJPWinningAP అని కూటమి అభిమానులు ట్వీట్లు చేస్తుండగా.. #YSRCPWinningBig అని వైసీపీ శ్రేణులు పోస్టులు చేస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలవనుందో కామెంట్ చేయండి.