India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్‌ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్‌లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.
TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత టాపార్డార్ తడబడింది. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ ధాటికి 34 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన గిల్ 8 బంతులాడి ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. అనంతరం కింగ్ కోహ్లీ 6 పరుగులే చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ యశస్వి(17), పంత్(0) ఉన్నారు.
జమిలి ఎన్నికలు జరగాలంటే కీలక రాజ్యాంగ సవరణలతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం. జమిలికి 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్డీయేకి ఇబ్బందులు లేనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్ని ఎన్డీయే మిత్రపక్షాలు పాలిస్తున్నాయి. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది. దీంతో ఈ విషయంలో ఎన్డీయేకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు.
నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో సెకండ్ సినిమా స్టార్ట్ అయింది. నిన్న షూటింగ్ స్టార్ట్ చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. ‘‘గతేడాది మార్చి 7న ‘దసరా’ సినిమా కోసం చివరిసారి ‘కట్, షాట్ ఓకే’ అని చెప్పా. మళ్లీ నిన్న నానికి ‘యాక్షన్’ చెప్పా. 48,470,400 సెకన్లు గడిచాయి. నా తర్వాతి సినిమా కోసం నిజాయితీగా ప్రతి సెకను వెచ్చించా. దసరాను మించిన మూవీ ఇది’’ అని ఓదెల ట్వీట్ చేశారు.
TG: రేపటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ చేపట్టనుంది. అఫిడవిట్లు ఇచ్చిన ఇంజినీర్లు, అధికారులను విచారించనుంది. ఎవరిని విచారించాలనే అంశమై కమిషన్ ఛైర్మన్ పీసీ.ఘోష్ నిర్ణయం తీసుకోనున్నారు. గత నెలలో పలువురు అధికారులను ఆయన విచారించిన సంగతి తెలిసిందే.
తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోకు సింగర్ కెనీషాతో ఉన్న సంబంధమే దీనికి కారణమని టాక్. తరచూ గోవా వెళ్లే ఆయన అక్కడే ఓ బంగ్లాను కొనుగోలు చేసి గాయనితోనే ఉంటున్నారని సమాచారం. దీనిపై ఆర్తికి తెలిసినా సన్నిహితులు నచ్చజెప్పడంతో ఆమె తగ్గారని తెలుస్తోంది. సడన్‌గా ఆయన విడాకులు ప్రకటించడంతో ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
NDA 3.0 ప్రభుత్వానికి రానున్న రోజులు కత్తిమీదసాములా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆమోదించిన మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2026లోపు జనగణన పూర్తి చేయాలి. అనంతరం ఈ లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల పెంపు, మహిళల సీట్ల రిజర్వ్ కోసం డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. మరోవైపు జమిలి ఎన్నికల కోసం కీలక రాజ్యాంగ సవరణలను ఆమోదింపజేయాలి.
Sorry, no posts matched your criteria.