News September 19, 2024

NDAకు రాబోయే రోజులు కత్తిమీదసామే?

image

NDA 3.0 ప్ర‌భుత్వానికి రానున్న రోజులు క‌త్తిమీద‌సాములా క‌నిపిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆమోదించిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాలంటే 2026లోపు జనగణన పూర్తి చేయాలి. అనంతరం ఈ లెక్కల ఆధారంగా దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ స్థానాల పెంపు, మ‌హిళల‌ సీట్ల రిజ‌ర్వ్ కోసం డీలిమిటేషన్ క‌మిష‌న్ వేయాలి. మరోవైపు జ‌మిలి ఎన్నిక‌ల కోసం కీల‌క రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌ను ఆమోదింపజేయాలి.

Similar News

News October 4, 2024

ఆ దాడులు చట్టబద్ధమైనవే: ఇరాన్ సుప్రీం ఖమేనీ

image

ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల త‌రువాత ఆయ‌న బ‌హిరంగ ఉప‌న్యాసం ఇచ్చారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్ర‌మ‌ణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేసుకోవాల‌న్నారు.

News October 4, 2024

చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.

News October 4, 2024

ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్

image

జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో ఇజ్రాయెల్ త‌న అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొల‌గించాం’ అని తెలిపారు.