India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్‌కు బాలినేని పంపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్‌తో భేటీ అనంతరం కూడా బెట్టు వీడలేదు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని జనసేనలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు.
TG: అత్యాచారం కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లద్దాక్‌లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు బృందాలు ఆయన కోసం అక్కడకు బయల్దేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులనూ సంప్రదించారు.
లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేశారు.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్‌కు రికీ పాంటింగ్‌ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్‌లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రిటైర్మెంట్ అంటే జోక్‌గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
భారత్‌లోని తమ ‘పుదుచ్ఛేరి’ ప్లాంట్‌లో ఏటా 50వేల ఏఐ ర్యాక్ సర్వర్లు, 2400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు(GPU) ఉత్పత్తి చేయనున్నట్లు లెనోవో ప్రకటించింది. ఈ ఉత్పత్తుల్ని భారత్‌లో అమ్మడంతో పాటు ఎగుమతులూ చేస్తామని వివరించింది. బెంగళూరులో ఓ ఏఐ కేంద్రీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. యాపిల్, ఫాక్స్‌కాన్, డెల్ సంస్థల తరహాలోనే లెనోవో కూడా చైనాలో పెట్టుబడులు తగ్గించి భారత్‌లో పెంచుతోంది.
AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.
ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-4కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా చంద్రయాన్-4కి ఇస్రో రూపకల్పన చేసింది. ఇటు గగన్‌యాన్, శుక్రయాన్ విస్తరణ ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,516 కోట్లు కేటాయించింది. పీఎం-ఆశా పథకానికి రూ.35 కోట్లు కేటాయింపు, ఎన్జీఎల్ఏ వాహననౌకకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Sorry, no posts matched your criteria.