News September 18, 2024
పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి

లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
Similar News
News February 12, 2026
శ్రీకాకుళం ఎంపీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తున్న మంత్రి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News February 12, 2026
ఓపిక తగ్గిపోతోందా?

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.
News February 12, 2026
IPLలో అన్‌సోల్డ్.. PSLలో ఖరీదైన ప్లేయర్

IPL వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిన స్టీవ్ స్మిత్‌కు PSLలో రికార్డు స్థాయి ధర లభించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధికంగా PKR 14 కోట్ల(₹4.54Cr)కు ఆయనను సియాల్‌కోట్ స్టాలియన్స్ సొంతం చేసుకుంది. బౌలర్ నసీమ్‌ను PKR 8.65 కోట్లకు, అష్రఫ్‌ను PKR 8.5 కోట్లకు ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్‌కు పెషావర్ టీమ్ PKR 7 కోట్లే వెచ్చించడం గమనార్హం. మార్చి 26 నుంచి మే 3 వరకు 8 జట్లతో PSL జరగనుంది.


