news

News May 14, 2024

భోజనం చేశాక టీ, కాఫీ తాగకండి: ICMR

image

టీ, కాఫీలు తాగడం అదుపులో ఉంచుకోవాలని ICMR సూచించింది. ముఖ్యంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. కనీసం గంట గ్యాప్ ఉండాలని పేర్కొంది. ఆహారంలోని ఐరన్‌ శరీరానికి అందకుండా ఇందులోని టానిన్ అనే పదార్థం అడ్డుకుంటుందని తెలిపింది. అందుకే ఆహారానికి.. కాఫీ, టీలకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ICMR స్పష్టం చేసింది. శరీరానికి ఆక్సిజన్ అందడానికి ఐరన్ దోహదపడుతుంది.

News May 14, 2024

వారణాసి ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా: మోదీ

image

చారిత్రక వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో పదేళ్లుగా అద్భుతమైన విజయాలు సాధించామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయని చెప్పారు.

News May 14, 2024

2-3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా: డీకే అరుణ

image

TG: యువత, SC, ST, BCలు తమకు అండగా నిలిచారని మహబూబ్‌నగర్ BJP MP అభ్యర్థి DK అరుణ చెప్పారు. CM రేవంత్ 8సార్లు జిల్లాలో ప్రచారం చేసినా, కాంగ్రెస్ నేతలు భయపెట్టినా ప్రజలు తమవైపే నిలిచారని తెలిపారు. తాను 2-3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని పేర్కొన్నారు.

News May 14, 2024

భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం: లక్ష్మణ్

image

TG: రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, గ్యారంటీల అమలు కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

News May 14, 2024

RCBని కాపాడేది ‘18’ ఒక్కటే

image

వరుస గెలుపులతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్లేఆఫ్స్‌‌కు క్వాలిఫై కావాలంటే జెర్సీ నెం.18 కలిగిన కోహ్లీ టీమ్‌ ఈనెల 18న చెన్నైపై 18 పరుగుల తేడాతో గెలుపొందాలి. లేదా 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. దీంతో ఆర్సీబీని కాపాడేది ‘18’ నంబర్ ఒక్కటే అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News May 14, 2024

YCP రౌడీలు దాడులు చేస్తున్నారు: CBN

image

పోలింగ్ అనంతరం కూడా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘నిన్నటి పోలింగ్‌లో వైసీపీ గూండాల దాడులను టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదురించారు. పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ, పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి’ అని CBN కోరారు.

News May 14, 2024

ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన MLC కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈనెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన 8 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేపడతామని జడ్జి చెప్పారు. కాగా ఇప్పటికే CBI కేసులో కవితకు కోర్టు ఈనెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

News May 14, 2024

ఎన్నికలు పూర్తికాగానే నెట్‌వర్క్ ఛార్జీల పెంపు?

image

టెలికాం సంస్థలు ఎన్నికల తర్వాత బిల్లులను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. 25% వరకు ఛార్జీలు పెంచి, యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో టెలికాం ఆపరేటర్లకు ARPUలో 16% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది.

News May 14, 2024

81శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: ముకేశ్ కుమార్

image

AP: రాష్ట్రంలో మొత్తం 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని ఇప్పటివరకు 79.40శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారని మీనా వివరించారు.

News May 14, 2024

ఇండోనేషియాలో వరదలు.. 50 మంది మృతి

image

ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.