news

News May 14, 2024

ఘరానా దొంగ.. 200 విమానాల్లో జర్నీ చేసి కొట్టేశాడు!

image

ఎయిర్‌పోర్టుల్లోని పటిష్ఠ భద్రతను దాటుకుని మరీ విమానాల్లో తోటి ప్రయాణికుల వస్తువులను ఓ దొంగ చోరీ చేయడం చర్చనీయాంశమైంది. రాజేశ్ కపూర్ అనే ఈ దొంగ 2023లో 100 రోజుల్లో 200 విమానాల్లో చోరీలు చేశాడు. కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే సీనియర్లు, మహిళలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తాడట. అలా ఇప్పటివరకు రూ.లక్షలు విలువైన వస్తువులు దోచేశాడు. గతంలో రైళ్లలో చోరీలు చేసిన రాజేశ్ పోలీసులకు పట్టుబడ్డాక రూట్ మార్చాడు.

News May 14, 2024

IPL: అదే జరిగితే RCB ఔట్!

image

వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఆర్సీబీకి వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ చేరేందుకు కీలకంగా ఉన్న చివరి మ్యాచు జరిగే శనివారం రోజున వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటకలో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే RCB ప్లేఆఫ్ ఆశలు గల్లంతే. మరోవైపు CSK ఆశలు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి.

News May 14, 2024

అత్యంత ఖరీదైన ఫిల్మ్‌గా ‘రామాయణం’?

image

నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నరగా వార్తల్లో నిలుస్తోన్న ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌గా నిలువనుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను రూ.835 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఫస్ట్ పార్ట్‌కే ఇంత ఖర్చు చేయనున్నారట.

News May 14, 2024

2012లో ఒక్కరే.. ఇప్పుడు ఐదుగురు

image

ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళా రెజ్లర్ల సంఖ్య పెరుగుతోంది. 2012లో ఒక్కరు మాత్రమే ఒలింపిక్స్‌లో పోటీపడగా, ఆ తర్వాత 2016లో ముగ్గురు, 2020లో నలుగురు క్వాలిఫై అయ్యారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఐదుగురు ఎంపికయ్యారు. దీంతో దేశంలో మహిళల రెజ్లింగ్ పురోగతి సాధిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మెడల్(2016-బ్రాంజ్) మాత్రమే గెలిచిన మహిళా రెజ్లర్లు ఈసారి ఎన్ని మెడల్స్ గెలుస్తారో చూడాలి.

News May 14, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

వాట్సాప్‌లో ‘ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో ఓ ఫీచర్ రానుంది. ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను ఈ ఫీచర్‌తో కంట్రోల్ చేయవచ్చు. డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

News May 14, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం!

image

కుటుంబమంతా కలిసి చూసే విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్‌ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.

News May 14, 2024

భారీ విజయం మాదే: కేశినేని చిన్ని

image

AP: కూటమి భారీ విజయంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని గ్రహించే నిన్న వైసీపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. కసి, కోపం, బాధతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని తెలిపారు. విజయవాడ పార్లమెంటులో అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని చిన్ని పేర్కొన్నారు.

News May 14, 2024

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు: మోదీ

image

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని చెప్పారు. యూపీ ప్రజలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరని అన్నారు. వారి జీవితాలను మార్చిన ప్రత్యామ్నాయ మోడల్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

News May 14, 2024

హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన టబు!

image

బాలీవుడ్ సీనియర్ నటి టబు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో ఆమె నటించనున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి.

News May 14, 2024

డోంట్ వర్రీ..T20 WCలో రోహిత్ అద్భుతంగా ఆడతాడు: గంగూలీ

image

IPLలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న వేళ BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగా ఆడతాడు. బిగ్ టౌర్నమెంట్స్‌లో రోహిత్ తన బెస్ట్ ఇస్తాడు. కాబట్టి ఫ్యాన్స్ అతని ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని గంగూలీ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది.