News September 18, 2024

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Similar News

News October 5, 2024

దర్శన్‌ను భయపెడుతోన్న రేణుకాస్వామి ఆత్మ!

image

కర్ణాటకలో సంచలనం సృష్టించిన <<14026281>>రేణుకాస్వామి<<>> హత్య కేసులో నిందితుడు హీరో దర్శన్ బళ్లారి జైలులో ఉన్నారు. ఇటీవల రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు దర్శన్ చెప్పినట్లు తెలుస్తోంది. తనను బెంగళూరు జైలుకు మార్చాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అర్ధరాత్రులు దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నారని, నిద్రలో కలవరిస్తున్నారని తోటి ఖైదీలు చెప్పినట్లు సమాచారం.

News October 5, 2024

టమాటా ధర రూ.73 దాటింది, ఎప్పుడు తగ్గిస్తారో చెప్పండి?: YCP

image

AP: తాను వచ్చాక ధరలు తగ్గిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలను నట్టేట ముంచారని YCP విమర్శించింది. ‘ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న. బాబు వచ్చాక ప్రజలు బతికే పరిస్థితి లేదు. అన్ని ధరలూ ఆకాశాన్ని అంటాయి. కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. టమాటా రూ.73 దాటింది. పేదలు కొనలేక, తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టించడం మానేసి ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పండి?’ అని ప్రశ్నించింది.

News October 5, 2024

నిరాహార దీక్షకు ఆర్‌జీ కర్ వైద్యుల నిర్ణయం

image

కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు 24గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించారు. ఓవైపు తమ విధులు నిర్వహిస్తూనే ధర్మతల మెట్రో ఛానల్ ప్రాంతంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. దుర్గాపూజ సమయంలోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడంపై ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోకుంటే వైద్య సేవల్ని మళ్లీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.