India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఎన్నికల్లో ఓటు వేసి తిరిగొస్తున్న వారితో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. ముఖ్యంగా ఎల్బీ నగర్-మియాపూర్ లైన్ కిటకిటలాడుతోంది. ఇవాళ డ్యూటీలు ఉండటంతో చాలా మంది ఉదయం పూటే తిరిగివస్తున్నారు. నిన్న బోసిపోయి కనిపించిన అమీర్ పేట మెట్రో స్టేషన్.. నేడు ప్రయాణికుల రద్దీతో జాతరను తలపిస్తోంది. దీంతో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా జూన్ 4వ తేదీన తేలనున్న ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘10వ తరగతి చదివిన వారి ఫలితాలు నిన్ననే వచ్చాయి. 12వ తరగతి చదివిన వారి ఫలితాలు రేపు విడుదలవుతాయి. కానీ, ఏమీ నేర్చుకోని వారి ఫలితాలు జూన్ 4న వస్తాయి’ అని సెటైర్లు వేశారు. ఆయన ఎవరిని ఉద్ధేశించి ఈ ట్వీట్ చేశారో కామెంట్ చేయండి.
TG: రాష్ట్రంలో ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో, రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. HYDలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రపంచంలోనే తొలి 6G డివైజ్‌ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్‌తో పోలిస్తే ఈ డివైజ్(నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఫలితాలు ఎలా వస్తాయనే ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో వైసీపీ, ఎన్డీయే కూటములు విజయంపై ధీమాగా ఉన్నాయి. #TDPJSPBJPWinningAP అని కూటమి అభిమానులు ట్వీట్లు చేస్తుండగా.. #YSRCPWinningBig అని వైసీపీ శ్రేణులు పోస్టులు చేస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలవనుందో కామెంట్ చేయండి.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిన్న నాల్గవ దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 11.45 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 78.25శాతం, బిహార్‌లో 57.06, జమ్మూకశ్మీర్‌లో 37.98, ఝార్ఖండ్‌లో 65.31, ఎంపీలో 70.98, మహారాష్ట్రలో 59.64, ఒడిశాలో 73.97, తెలంగాణలో 64.93, యూపీలో 58.05, పశ్చిమ బెంగాల్‌లో 78.44 శాతం పోలింగ్ నమోదైంది.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. బీజేపీని ప్రజలు ‘ప్రజాస్వామ్యానికి ముప్పు’గా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడంతో పాటు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయన్నారు. బీజేపీ మత ప్రచారం కూడా ఆ పార్టీకి చేటు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,815 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు సమకూరింది.
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉపఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.