news

News May 14, 2024

RCBని కాపాడేది ‘18’ ఒక్కటే

image

వరుస గెలుపులతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్లేఆఫ్స్‌‌కు క్వాలిఫై కావాలంటే జెర్సీ నెం.18 కలిగిన కోహ్లీ టీమ్‌ ఈనెల 18న చెన్నైపై 18 పరుగుల తేడాతో గెలుపొందాలి. లేదా 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించాల్సి ఉంది. దీంతో ఆర్సీబీని కాపాడేది ‘18’ నంబర్ ఒక్కటే అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News May 14, 2024

YCP రౌడీలు దాడులు చేస్తున్నారు: CBN

image

పోలింగ్ అనంతరం కూడా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘నిన్నటి పోలింగ్‌లో వైసీపీ గూండాల దాడులను టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదురించారు. పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ, పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి’ అని CBN కోరారు.

News May 14, 2024

ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన MLC కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈనెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన 8 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేపడతామని జడ్జి చెప్పారు. కాగా ఇప్పటికే CBI కేసులో కవితకు కోర్టు ఈనెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

News May 14, 2024

ఎన్నికలు పూర్తికాగానే నెట్‌వర్క్ ఛార్జీల పెంపు?

image

టెలికాం సంస్థలు ఎన్నికల తర్వాత బిల్లులను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. 25% వరకు ఛార్జీలు పెంచి, యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో టెలికాం ఆపరేటర్లకు ARPUలో 16% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది.

News May 14, 2024

81శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: ముకేశ్ కుమార్

image

AP: రాష్ట్రంలో మొత్తం 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని ఇప్పటివరకు 79.40శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారని మీనా వివరించారు.

News May 14, 2024

ఇండోనేషియాలో వరదలు.. 50 మంది మృతి

image

ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.

News May 14, 2024

ఈ ఏడాది తొలి గ్రాండ్ మాస్టర్‌గా శ్యామ్ నిఖిల్

image

తమిళనాడుకు చెందిన శ్యామ్ నిఖిల్ చరిత్ర సృష్టించారు. దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకోవడం‌తో తుది జీఎం నార్మ్‌ సాధించి గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆయన ఈ ఘనత అందుకున్నారు. దీంతో ఈ ఏడాది గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన తొలి భారత చెస్ ప్లేయర్‌గా రికార్డుకెక్కారు. దీంతో శ్యామ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. శ్యామ్ భారత్ తరఫున 85వ గ్రాండ్ మాస్టర్ కావడం విశేషం.

News May 14, 2024

వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొననున్న పవన్?

image

ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఈక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా షూటింగ్స్‌లో ఎప్పుడు పాల్గొంటారనే అంశంపై నెట్టింట చర్చ మొదలైంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న OG, హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో OG షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాల సమాచారం.

News May 14, 2024

ఘోరం.. చిన్నారిని పీక్కు తిన్న పెంపుడు కుక్క

image

TG: వికారాబాద్‌(D) తాండూరులో ఘోరం జరిగింది. 5 నెలల చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. MBNR జిల్లాకు చెందిన దత్తు, లావణ్య బసవేశ్వరనగర్‌లోని నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. దంపతులు వస్తువులు కొనడానికి వెళ్లగా.. నాగభూషణం పెంపుడు కుక్క ఇంట్లోని వారి కొడుకుపై దాడి చేసింది. చిన్నారి కనుగుడ్డును, మొహంలోని కొంత భాగాన్ని పీక్కుతిన్నది. దీంతో బాబు ప్రాణాలు కోల్పోయాడు.

News May 14, 2024

మరో బాలీవుడ్ చిత్రంలో కీర్తి సురేశ్!

image

హీరోయిన్ కీర్తి సురేశ్ బంపరాఫర్ కొట్టేసినట్లు సమాచారం. వరుణ్ ధవన్ సరసన ‘బేబీ జాన్’ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా దాదాపు ఎంపికైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే నిజమైతే కీర్తి బాలీవుడ్‌లో పాగా వేస్తారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.