News September 18, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 5, 2024
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.
News October 5, 2024
TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు
AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
News October 5, 2024
కంపెనీల వెబ్‌సైట్లకూ బ్లూటిక్.. త్వరలో గూగుల్ కొత్త ఫీచర్
ఫేక్ వెబ్‌సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.