India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: సెప్టెంబర్ 18, బుధవారం
✒ పౌర్ణమి: ఉదయం 8.04 గంటలకు
✒ పాడ్యమి: తెల్లవారుజామున 4.19 గంటలకు
✒ పూర్వాభాద్ర: ఉదయం 11.00 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 7.25 నుంచి 8.49 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.37 నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు
* TG: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
* ప్రజా ప్రభుత్వం రావడంతో ప్రజా పాలన దినోత్సవం: రేవంత్
* బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం: కిషన్‌రెడ్డి
* ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం: KTR
* AP: వరద బాధితుల ఆర్థిక సాయం వివరాలు ప్రకటించిన ఏపీ సీఎం
* బోట్లను వదిలిన వారిని విడిచిపెట్టం: మంత్రి అనిత
* ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. త్వరలోనే ఆతిశీకి బాధ్యతలు
AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏడాది పాటు మారిటోరియం కల్పించాయని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ జే.నివాస్ తెలిపారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలు రూ.50 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారు రూ.25వేలు వినియోగ రుణాలు పొందొచ్చన్నారు. పంట రుణాలు, ఆటో, బైక్స్, కిరాణా షాపులు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకూ రుణాల మారిటోరియంతో పాటు అవసరం మేరకు కొత్త రుణాలు పొందొచ్చన్నారు.
వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ నడుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను పరిగణించబోమని స్పష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.
TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.
AP: విజయవాడ వరద బాధితుల కోసం తెలుగు హీరోయిన్ కొన్ని రోజుల క్రితం రూ.2.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు సైతం ఈ హీరోయిన్ రూ.2.50 లక్షల విరాళం ప్రకటించారు.
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
పాకిస్థాన్ క్రికెట్ అంపశయ్య మీద ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు అత్యవసరమని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బాబర్ ఆజం మానసిక ఒత్తిడికి గురై ఆటలో రాణించలేకపోతున్నారని చెప్పారు. ఆయన కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టులో తొలిసారిగా బంగ్లా చేతిలో పాక్ క్లీన్‌స్వీప్‌కు గురికావడం ఆ జట్టు దుస్థితికి అద్దం పడుతోంది.
మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు రూ. 130 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనిని విద్యా సంస్థలో ఆర్థిక రంగంలో పరిశ్రమ ఆధారిత వినూత్న కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనల మెరుగుకు ఖర్చు చేయనున్నారు. ఇది భారతీయ విద్యా సంస్థకు అందిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాలలో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా మోతిలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఐఐటీ బాంబేలో ఏర్పాటు చేయనున్నారు.
పుష్పలో అల్లు అర్జున్ ఉపయోగించే పేజర్ గుర్తుందా? వాటి కంటే అత్యాధునికమైనవి వాడుతోంది లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ను ఇజ్రాయెల్ సులభంగా హ్యాక్ చేయగలదని ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం పేజర్లను వాడుతోంది. రక్షణ సంబంధిత సాంకేతికత అంశాల్లో ఇజ్రాయెల్ శత్రుదుర్భేద్యంగా ఉంది. అందుకే <<14127059>>వేలాది పేజర్లు ఒకే రోజు పేలడం<<>> వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.
Sorry, no posts matched your criteria.