News September 18, 2024

చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్

image

TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.

Similar News

News October 5, 2024

‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’.. మహిళా క్రికెటర్లపై విమర్శలు

image

T20WCలో భారత మహిళల జట్టు నిన్న NZ చేతిలో ఓడింది. దీంతో ఆ జట్టుపై SMలో ట్రోలింగ్ మొదలైంది. ట్రోల్స్‌ను సపోర్ట్ చేస్తూ ‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’ అని కొందరు పోస్టులు చేస్తున్నారు. మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లు జీతాలు తీసుకుంటున్నప్పుడు ట్రోలింగ్‌ను కూడా అలాగే స్వీకరించాలంటున్నారు. ₹కోట్ల జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థికి పోటీనివ్వకుండా ఓడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

News October 5, 2024

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

image

FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్‌గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్‌లో ఉంది.

News October 5, 2024

బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు

image

AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.