India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలిచేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలికి తాను నటించే, గీతా ఆర్ట్స్ నిర్మించే అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఇప్పటికే ‘పుష్ప-2’లోనూ పని చేస్తున్నారని టాక్. తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్‌లో బన్నీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నార్నె నితిన్ హీరోగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్ మ్యాక్స్‌తో బాయ్స్ మళ్లీ రాబోతున్నారు’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ‘మ్యాడ్’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
AP: టెట్ మాక్ టెస్ట్‌లను 19వ తేదీ నుంచి ఆన్‌లైన్(http://cse.ap.gov.in)లో అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. మాక్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
AP: కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘నీరు-చెట్టు’ పెండింగ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయమై మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ ఆయనను కలిశారు. దీంతో తొలి విడతలో రూ.259 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.
ఎక్కువమంది బాధపడే సమస్యల్లో కళ్లు పొడిబారడం ఒకటి. కంప్యూటర్లు, మొబైళ్లు, టీవీలు అతిగా చూడటమే ఇందుకు కారణం. దీన్నుంచి తప్పించుకోవాలంటే ఏటా ఒక్కసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సలహా. కొన్ని రకాల మెడిసిన్స్ మానేయడం, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దుమ్ము, ధూళి, పొగ, ఎండ, వెలుతురు విపరీతంగా ఉండే వాతావరణానికి దూరమవ్వాలి. కంటి నిండా నిద్ర, స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటే మంచిది.
దేశవ్యాప్తంగా UPI సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరగట్లేదు. పేమెంట్ చేసే సమయంలో యూపీఐ నెట్‌వర్క్ స్లోగా ఉందని చూపిస్తోంది. దీంతో యూజర్లు డబ్బులు పంపలేక ఇబ్బంది పడుతున్నారు. మరి మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.
TG: భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం(D) నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.
చెస్ ఒలింపియాడ్-2024లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘మీరు Chess Olympiad 2024లో భారత్ ఏ స్థాయిలో ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. రౌండ్ 6 తర్వాత ఓపెన్ & మహిళల విభాగాల్లో భారత్ ఆధిక్యంలో ఉంది. వారిని ఉత్సాహపరచండి. ప్రపంచంలోని టాప్-5లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.