news

News May 14, 2024

కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్

image

AP: వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా’ అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.

News May 14, 2024

టీ20 వరల్డ్ కప్‌కు హార్దిక్‌ను వద్దన్న రోహిత్!

image

T20WC ఎంపికపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నీకి హార్దిక్‌ను ఎంపిక చేయడం రోహిత్, సెలక్టర్ అగార్కర్‌కు ఇష్టం లేదని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఐపీఎల్లో అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు కారణమని తెలిపింది. అయితే పొట్టి ప్రపంచకప్ తర్వాత T20లకు రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉండటం, కెప్టెన్‌గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేకపోవడంతో WCకు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

News May 14, 2024

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వెలువరించారు.

News May 14, 2024

ఓటమి భయంతోనే చెవిరెడ్డి దాడులు: నాని కుమారుడు

image

AP: పక్కా ప్రణాళికతోనే తన తండ్రిపై దాడి చేశారని పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆరోపించారు. మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వస్తే బీర్ బాటిల్స్, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. డ్రైవర్ లేకపోతే తన తండ్రి ప్రాణాలతో ఉండేవారు కాదన్నారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని, పోలీసులూ సహకరించారని ఆరోపించారు. 15 రోజుల్లో ఆయనకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

News May 14, 2024

మే 18.. అంటే తగ్గేదేలే

image

మే 18.. అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే. కొన్నేళ్లుగా ఆ తేదీన జరిగిన మ్యాచ్‌ల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో బెంగళూరుకు ఓటమి అన్నదే లేదు. మే 18న పలు సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 56*, 27, 113, 100 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అదే తేదీన ఈ శనివారం చెన్నైతో డూ ఆర్ డై మ్యాచ్ జరగనుండటంతో కోహ్లీ చెలరేగి జట్టును ప్లే ఆఫ్స్‌కు చేరుస్తారంటూ అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News May 14, 2024

తిహార్ జైలుకు బాంబు బెదిరింపు

image

తిహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకుడు ఫోన్ చేసిన బెదిరించాడు. దీంతో జైలు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవిత ప్రస్తుతం ఈ జైలులోనే ఉన్నారు.

News May 14, 2024

గాలిదుమారం వచ్చినప్పుడు ఏం చేయాలి?

image

* గాలి వీచే సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. అలా చేయడం వల్ల దుమ్ము ఇంట్లోకి రావు.
* కళ్లకు కళ్లజోడు, ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి. తద్వారా దూళి కణాలు శరీరంలోకి ప్రవేశించవు..
* అతిగా వ్యాయామం చేయవద్దు
* చెట్ల కింద వాహనాలు పార్కింగ్ చేయవద్దు.
>> నిన్న ముంబైలో గాలిదుమారం రాగా ఓ భారీ హోర్డింగ్ కూలడంతో 14మంది మరణించగా.. 70మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

News May 14, 2024

కరోనాపై కథనాలు.. నాలుగేళ్ల తర్వాత విడుదలైన చైనా జర్నలిస్టు

image

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ గురించి కథనాలు రాయడంతో జైలు పాలైన చైనా జర్నలిస్టు జాంగ్ జాన్ నాలుగేళ్ల తర్వాత విడుదలయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆమె వుహాన్ వెళ్లి అక్కడి దారుణ పరిస్థితుల గురించి యూట్యూబ్, WECHAT, X లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. దీంతో చైనా ప్రభుత్వం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా కథనాలు ఉన్నాయని ఆరోపిస్తూ షాంఘై జైలుకు పంపింది.

News May 14, 2024

ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రూ.1.41 లక్షల కోట్లు

image

ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. 2023-24లో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. 2022-23లో రూ.1.04 లక్షల కోట్ల ఆదాయం రాగా, ఈసారి 35 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో SBI వాటా 40 శాతం(రూ.61,077 కోట్లు) ఉంది. PNB రూ.8,245 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.2,549 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.

News May 14, 2024

PROUD MOMENT

image

భారత వారసత్వ సంపద అయిన రామచరిత్ మానస్, పంచతంత్ర, సహృదయాలోక-లోచనా వంటి ఇతిహాసాలు UNESCOకి చెందిన ఆసియా-పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో చోటు దక్కించుకున్నాయి. ఈ ఘనత సాధించడం భారతదేశానికే గర్వకారణమని సాంస్కృతిక శాఖ పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణలో ఇది ఒక ముందడుగని తెలిపింది. ఈ సాహిత్య కళాఖండాలను గుర్తించడం వల్ల వీటి రచయితలకు గొప్ప నివాళులు అర్పించడమేనని వెల్లడించింది.