News September 17, 2024
జియో సేవల్లో అంతరాయం
ప్రముఖ టెలికం కంపెనీ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్ సరిగా రాకపోవడంతో కాల్స్ కలవడం లేదని యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ముంబైలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్‌లోనూ కాల్స్ కలుస్తున్నా వాయిస్ కట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
Similar News
News October 13, 2024
అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు
AP: దక్షిణ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అది 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అటు తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
News October 13, 2024
త్వరలో మరో పార్టీలో చేరుతా: రాపాక
AP: వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే <<14347126>>రాపాక<<>> వరప్రసాద్ తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ‘గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. TDP నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్‌ఛార్జ్‌గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా MPగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా’ అని మీడియాకు వెల్లడించారు.
News October 13, 2024
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!
ఈ దీపావళికి దేశీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలు సగటున 20-25% తగ్గినట్టు పలు సంస్థలు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై వన్ వేలో ఈ సగటు తగ్గింపు ధరలు వర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య, ఇంధన ధరల తగ్గింపు వల్ల ధరలు దిగొచ్చినట్టు అంచనా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధరలు తగ్గినట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.