India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఓవైపు లోక్‌సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రంగంలోకి దిగాయి. కానీ మళ్లీ చక్రం తిప్పుతామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ మాత్రం పత్తా లేదు. ఇప్పటికి 11మంది ఎంపీ అభ్యర్థుల్ని మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. పలువురు అగ్రనేతలు పార్టీ వీడటం, ఇటు కవితను ఈడీ అరెస్టు చేయడం కారణాల వల్లో ఏమో కానీ.. కేసీఆర్ నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో జోరు కనిపించడం లేదు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ దీనిపై విచారించనుంది. కవిత తన పిటిషన్‌లో ఈడీని ప్రతివాదిగా చేర్చారు.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం లిథువేనియాలో అత్యంత సంతోషకరమైన యువకులు (30 ఏళ్లలోపు) ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, సెర్బియా, ఐస్‌లాండ్, డెన్మార్క్ ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో భారత్ 27వ స్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో ఇండియా 126వ ర్యాంకులో ఉంది.
ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ రైలు ఎక్కినా, దిగినా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తామని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే రైల్వే ట్రాక్‌పై సెల్ఫీలు తీసుకున్నా జైలు శిక్ష తప్పదని చెబుతున్నారు. పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, ఫొటోగ్రఫీలు తీసుకుంటే కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పేర్కొంటున్నారు. నిషేధ ఆజ్ఞలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.
AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.
AP: తనను జనసేనలోకి ఆహ్వానించిన పవన్‌కళ్యాణ్‌కు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. ‘నేను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె మాట్లాడారు.
IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. దీనివల్ల థర్డ్ అంపైర్‌కు నిర్ణయాలు తీసుకోవడం ఈజీ కానుంది. 8 హైస్పీడ్ కెమెరాలు తీసే వీడియోలను హాక్ ఐ ఆపరేటర్ల ద్వారా థర్డ్ అంపైర్ చూస్తారు. గతంలో కంటే ఎక్కువ దృశ్యాలను వివిధ కోణాల్లో చూసే అవకాశం ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడనుంది. అంపైర్లకు ఇటీవలే దీనిపై శిక్షణనిచ్చారు. ఈ విధానాన్ని ఇప్పటికే ‘ద హండ్రెడ్’ టోర్నీలో వాడారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో మిస్ అయిన సైనికుడు చనిపోయినట్లు 80 ఏళ్ల తర్వాత గుర్తించారు. 1944లో జర్మనీతో జరిగిన పోరాటం తర్వాత US సైనికుడు రీవ్స్ కనిపించలేదు. అయితే 1948లో హార్ట్‌జెన్ ఫారెస్ట్‌లో కొన్ని అవశేషాలను గుర్తించగా.. వాటిని బెల్జియంలోని సైనిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. తాజాగా DNA టెస్ట్‌లో ఆ అవశేషాలు రీవ్స్‌వేనని నిర్ధారించారు. ఇంకా 72 వేల మందికి పైగా US సైనికులు ‘మిస్సింగ్’గానే ఉన్నారు.
అంపైర్లతో దురుసు ప్రవర్తన కారణంగా శ్రీలంక స్పిన్నర్ హసరంగపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో వన్డే సిరీస్ అనంతరం అతడు ఆడే 2 టెస్టులు లేదా 4 వన్డేలు/టీ20 మ్యాచులపై నిషేధం అమలవ్వాల్సి ఉంది. బంగ్లాతో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది టీ20 వరల్డ్ కప్‌లోనే. దీంతో ఆ సమయంలో బ్యాన్ అవకుండా.. శ్రీలంక బోర్డు తెలివిగా టెస్టులకు అతడిని ఎంపిక చేసిందన్న వాదన నెట్టింట వినిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.