India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు అందినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. బాధిత పార్టీల ప్రైవసీని రక్షించాలని మీడియాను అభ్యర్థించింది. దీనిపై POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని పేర్కొంది.
ప్రభుత్వ సంస్థలను నిరుత్సాహపరచడమే కాకుండా రాజకీయ చర్చను రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యానాలకైనా న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. చట్టబద్ధమైన పనితీరును అనుసరించే బలమైన, స్వతంత్ర సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. CBI పంజరంలో చిలక అనే భావన లేకుండా ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ధన్‌ఖఢ్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో మరో 7 సిక్సర్లు కొడితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టిస్తారు. ఈ ఏడాది జైస్వాల్ మొత్తం 26 సిక్సర్లు బాదారు. అగ్ర స్థానంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (33) ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఈ రికార్డును అధిగమించేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు.
జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన యువతి పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తన వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడని తెలిపారు. లైంగికంగా ఎంతో వేధించాడని, సహకరించకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని వాపోయారు. ఆమె ఇంట్లోనే 3 గంటలు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు, అనంతరం ఆమెకు వైద్యపరీక్షలు చేయించేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు.
‘దేవర’ సినిమా డైరెక్టర్ కొరటాల శివకు అందిన రెమ్యునరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన రూ.30 కోట్ల వరకు అందుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఆచార్య ఒక్కటే డిజాస్టర్‌గా నిలిచింది. గతంలో NTR, కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఈ కారణంతోనే ఆయన పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
యూపీలోని ఆగ్రాలో తన భర్త స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే భార్య విడాకులు కోరింది. తమ పెళ్లైనప్పటి నుంచి ఇప్పటివరకు 6 సార్లు మాత్రమే స్నానం చేశారని కోర్టుకు తెలిపింది. స్నానం చేయకపోగా వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని, దుర్వాసన వస్తోందని పేర్కొంది. అతడితో కలిసి జీవించడం తన వల్ల కాదని వాపోయింది. కౌన్సెలింగ్ తర్వాత రోజూ స్నానం చేసేందుకు భర్త ఒప్పుకున్నా ఆమె మాత్రం అతడితో ఉండటానికి ఇష్ట పడలేదు.
బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. ఆరోజు ఈ స్కీమ్ విధివిధానాలను తెలియజేయనున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ NPS వాత్సల్య ఖాతాను తెరవొచ్చు. దీంతో ముందుగానే పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. చక్రవడ్డీతో పాటు అదనపు పన్ను మినహాయింపులుంటాయి. 18 ఏళ్ల తర్వాత ఇది సాధారణ NPS ఖాతాగా మారుతుంది.
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. సిద్ధార్థ్ 20 ఏళ్ల క్రితమే తన ఇంటి పక్కనుండే మేఘనా నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి వివాహం ఎక్కువ కాలం నిలువలేదు. ‘రంగ్ దే బసంతి’ మూవీ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2007లో విడిపోయారు. అదితి గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకొని విడిపోయారు.
* 15వేల మంది పోలీసులతో బందోబస్తు
* మెట్రో సేవలు అర్ధరాత్రి 2 గంటల వరకు పొడిగింపు
* 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
* రేపు ఉ.6 గంటల నుంచి రా.11 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులకు నగరంలోకి అనుమతి నిరాకరణ
* మహిళల భద్రత కోసం హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 షీటీమ్స్
* 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా
* మ.1.30 గంటలలోపు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
TG: ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉ.6 గంటలకు కదలనున్నాడు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌దూత్ హోటల్(లక్డీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి గణనాథుడి ఊరేగింపు కొనసాగనుంది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.