News September 16, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. మరిన్ని సంచలన విషయాలు

image

జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన యువతి పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తన వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడని తెలిపారు. లైంగికంగా ఎంతో వేధించాడని, సహకరించకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని వాపోయారు. ఆమె ఇంట్లోనే 3 గంటలు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు, అనంతరం ఆమెకు వైద్యపరీక్షలు చేయించేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు.

Similar News

News October 4, 2024

తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’

image

ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000km ప్రయాణించి, రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసింది. 22 రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత OCT 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. 1958 జనవరి 4న ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.

News October 4, 2024

15 శాతం వృద్ధి రేటు సాధించాలి: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ అస్పష్ట ఆర్థిక విధానాల కారణంగా చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగంలో సాధించాల్సిన వృద్ది రేటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన కష్టాలున్నా 2014-19లో 13.7% వృద్ధిరేటును సాధించామని, గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10.59%కి పడిపోయిందని చెప్పారు.

News October 4, 2024

‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్

image

డైరెక్టర్ కొరటాల శివతో తన ప్రయాణం ‘బృందావనం’ సినిమాతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీ మెంబర్‌గా మారారని ఎన్టీఆర్ తెలిపారు. ‘దేవర’ సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు. ‘ఈ జన్మలో నేను మీ కోసం ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే. వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.