India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉ.6 గంటలకు కదలనున్నాడు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌దూత్ హోటల్(లక్డీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి గణనాథుడి ఊరేగింపు కొనసాగనుంది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ(CRDA) డబ్బులు జమ చేసింది.
AP: విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇలాగే ముందుకు సాగాలని ఆయనకు సూచించారు. కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలని లోకేశ్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని భావించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు ఆయన సంకల్పించారు.
AP: CBSEని పూర్తిగా రద్దు చేసినట్లు కల వచ్చిందా జగన్? అని TDP ట్వీట్ చేసింది. ‘నీ ప్రచార పిచ్చితో 77,478 మంది విద్యార్థులను రోడ్డున పడేశావు. హడావుడిగా CBSE ప్రవేశపెట్టి కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. మోడల్ ఎగ్జామ్ నిర్వహిస్తే 77,478 మందిలో 49,410 మంది ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ ఏడాది CBSEకి కాకుండా స్టేట్ బోర్డుకే పరీక్షలు రాస్తారు’ అని పేర్కొంది.
TG: కొత్త రేషన్ కార్డుల విధివిధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాల్లోనే ఆ కార్డులు ఇచ్చిందన్నారు.
సీఎం మమతా బెనర్జీతో చర్చలకు జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఐదోసారి, ఇదే చివరిసారంటూ సీఎస్ చర్చలకు ఆహ్వానించడంతో వైద్య సంఘాలు స్పందించాయి. లైవ్ స్ట్రీమింగ్‌కి, ఇరు వర్గాలు మినిట్స్ రికార్డ్ చేసుకోవడానికి అంగీకరించాలని వైద్యులు డిమాండ్ చేశారు. లైవ్ స్ట్రీమింగ్‌ను ఇదివరకే తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, మీటింగ్ మినిట్స్‌ను వైద్యులతో పంచుకోవడానికి అంగీకరించింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని చేసిన వివాదాస్పద ట్వీట్‌ను ఎలాన్ మస్క్ తొలగించారు. ‘నేను దీన్నుంచి నేర్చుకుందేమిటంటే? నేనేదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు ప్రజలు నవ్వుతారు. దానర్థం అది Xలో పోస్ట్ చేస్తే అంతే ఫన్నీగా ఉంటుందని కాదు’ అని రాసుకొచ్చారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్ అడగ్గా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తన చివరి ODI మ్యాచ్ ఆడి నేటికి 13 ఏళ్లు పూర్తవుతోంది. 2011లో ఇదేరోజున ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా తరఫున ద్రవిడ్ తన చివరి వన్డే ఆడారు. ఆయన 15 ఏళ్ల ODI కెరీర్‌లో 344 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 12సెంచరీలు, 83 అర్ధసెంచరీలతో 10,889 రన్స్ చేశారు. కాగా, ఇదేరోజు ఇంగ్లిష్ గడ్డపై రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన తొలి సెంచరీ నమోదు చేశారు.
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో సమావేశమైంది. లిక్కర్ పాలసీ కేసులతో సంబంధంలేని అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గహ్లోత్ CM రేసులో ముందున్నారు! ఈ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై రేపు 11.30 గంటలకు జరిగే ఆప్ LP మీటింగ్‌లో చర్చించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం కేజ్రీవాల్ రాజీనామా సమర్పించనున్నారు.
TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ మూతపడనున్నాయి. రేపు ఉ.6 గంటల నుంచి ఎల్లుండి సా.6 వరకు మద్యం వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఇవాళ రా.11 గంటల వరకే అవకాశం ఉండటంతో వైన్స్ రద్దీగా మారాయి.
Sorry, no posts matched your criteria.