News September 16, 2024

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే?

image

TG: కొత్త రేషన్ కార్డుల విధివిధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాల్లోనే ఆ కార్డులు ఇచ్చిందన్నారు.

Similar News

News October 7, 2024

వామ్మో.. యువతి పొట్టలో 2 కిలోల జుట్టు!

image

UPలోని లక్నోలో ఓ యువతి(21) పొట్ట నుంచి వైద్యులు 2 కిలోల జుట్టును సర్జరీ ద్వారా తొలగించారు. గడచిన 16 ఏళ్లుగా ఆమె తన జుట్టు తనే పీకేసి తినేస్తోందని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రికోఫేగియా లేదా రపంజెల్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తామని వివరించారు. పొట్టలోపల మొత్తం మాత్రమే కాక పేగుల్లోకి కూడా జుట్టు చుట్టుకుందని పేర్కొన్నారు. తరచూ వాంతులవుతుండటంతో పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు.

News October 7, 2024

అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు

image

అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.