India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చరణ్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ‘బీస్ట్ మోడ్ ఆన్ RC16 లోడింగ్’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటోను పంచుకున్నారు. తన ఫిట్నెస్ కోచ్ శివోహంను ఫొటోకు ట్యాగ్ చేశారు. దీంతో సినిమా కోసం చెర్రీ మరోసారి తన బాడీని బీస్ట్‌గా మార్చేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.
ఇష్టమైన ఫుడ్ ఉంటే సుష్ఠుగా లాగించేస్తుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొట్టను 80శాతం నింపి, 20 శాతం ఖాళీగా వదిలేయాలని పేర్కొంటున్నారు. దీని వలన అరుగుదల, ఆరోగ్యం బాగుంటాయని సూచిస్తున్నారు. పొట్ట పెరిగే సమస్య కూడా తగ్గుతుందంటున్నారు. జపనీయులు ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఆకలి తీరడానికే తప్ప కడుపు పూర్తిగా నింపని ఈ ప్రక్రియను వారు ‘హర హచి బు’గా వ్యవహరిస్తారు.
AP: గతంలో ITని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత IT నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తోంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. APలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ <<14114235>>వివాహం<<>> చేసుకున్నారు. అదితి వనపర్తి రాజ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి ఎహసాన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ పీఎం అక్బర్ హైదరీ మనవడు. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి వారసురాలు. వీరందరి వివాహాలు ఇదే గుడిలో జరిగాయి. ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్.
TG: హైదరాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు నిమజ్జన ప్రక్రియను 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఒక వేళ నిర్వహించాలనుకుంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఆ సవరణలు ప్రతిపాదిస్తూ లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులను ప్రవేశపెట్టే సంఖ్యా బలం ప్రధాని మోదీకి లేదని పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నికకు ఇండియా కూటమి వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు.
రైల్వేలో 1,376 పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి <
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. సెప్టెంబర్ 17న సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేజ్రీ రాజీనామా లేఖను అందజేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో ఆయన అనుమతిచ్చారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తొలి వందే మెట్రోను ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య ఈ రైలును ‘నమో భారత్ రాపిడ్ రైలు’గా వర్ణించారు. దీంతో పాటు వర్చువల్‌గా పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్‌కు 2 ట్రైన్లు ఉన్నాయి. మరో మూడు కొల్లాపూర్-పుణే, హుబ్బళ్లి-పుణే, ఆగ్రా-బనారస్ మధ్య నడవనున్నాయి.
సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కోరారు. బయటకొచ్చి మాట్లాడితే అవకాశాలు రావనే ఆలోచనలో ఉండొద్దన్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై బాలీవుడ్ నుంచి స్పందన లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అది అక్కడ పని చేసే మహిళలపై ఆధారపడి ఉంటుంది. బాధితులు నిజాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.