News September 16, 2024

ITలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: చంద్రబాబు

image

AP: గతంలో ITని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత IT నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తోంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. APలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

నేడు దానధర్మాలు చేస్తే..?

image

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.

News November 13, 2025

‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

image

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

News November 13, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.in‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.