news

News September 16, 2024

RC16 లోడింగ్.. చరణ్ స్పెషల్ పోస్ట్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చరణ్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ‘బీస్ట్ మోడ్ ఆన్ RC16 లోడింగ్’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటోను పంచుకున్నారు. తన ఫిట్‌నెస్ కోచ్ శివోహంను ఫొటోకు ట్యాగ్ చేశారు. దీంతో సినిమా కోసం చెర్రీ మరోసారి తన బాడీని బీస్ట్‌గా మార్చేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

News September 16, 2024

కడుపు నిండా తింటున్నారా.. ఇది చదవండి

image

ఇష్టమైన ఫుడ్ ఉంటే సుష్ఠుగా లాగించేస్తుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొట్టను 80శాతం నింపి, 20 శాతం ఖాళీగా వదిలేయాలని పేర్కొంటున్నారు. దీని వలన అరుగుదల, ఆరోగ్యం బాగుంటాయని సూచిస్తున్నారు. పొట్ట పెరిగే సమస్య కూడా తగ్గుతుందంటున్నారు. జపనీయులు ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఆకలి తీరడానికే తప్ప కడుపు పూర్తిగా నింపని ఈ ప్రక్రియను వారు ‘హర హచి బు’గా వ్యవహరిస్తారు.

News September 16, 2024

ITలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: చంద్రబాబు

image

AP: గతంలో ITని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత IT నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తోంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. APలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News September 16, 2024

సిద్ధార్థ్, అదితిల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు?

image

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ <<14114235>>వివాహం<<>> చేసుకున్నారు. అదితి వనపర్తి రాజ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి ఎహసాన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ పీఎం అక్బర్ హైదరీ మనవడు. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి వారసురాలు. వీరందరి వివాహాలు ఇదే గుడిలో జరిగాయి. ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్.

News September 16, 2024

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం సమీక్ష

image

TG: హైదరాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు నిమజ్జన ప్రక్రియను 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 16, 2024

జమిలీ ఎన్నికలు సాధ్యంకావు: చిదంబరం

image

ప్ర‌స్తుతం ఉన్న‌ రాజ్యాంగం ప్ర‌కారం దేశంలో జ‌మిలీ ఎన్నిక‌లు సాధ్యం కావని కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం అన్నారు. ఒక వేళ నిర్వ‌హించాల‌నుకుంటే ఐదు రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. అయితే, ఆ స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదిస్తూ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టే సంఖ్యా బ‌లం ప్ర‌ధాని మోదీకి లేద‌ని పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నికకు ఇండియా కూట‌మి వ్య‌తిరేకం అని ఆయన స్ప‌ష్టం చేశారు.

News September 16, 2024

1,376 రైల్వే ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు

image

రైల్వేలో 1,376 పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి <>దరఖాస్తు<<>> ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు RRB అవకాశమిచ్చింది. మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా అప్లై చేసుకునేందుకు కనిష్ఠ వయసు 18, గరిష్ఠ వయసు 43గా ఉంది. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరగనుంది. ఉద్యోగాలను బట్టి జీతం రూ.19,900-44,900 వరకు ఉంటుంది.

News September 16, 2024

రేపు సాయంత్రం ముఖ్య‌మంత్రి రాజీనామా

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మంగ‌ళ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌ల‌వ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 17న‌ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే కేజ్రీవాల్‌ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. తాజాగా కేజ్రీ రాజీనామా లేఖను అందజేసేందుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరడంతో ఆయన అనుమతిచ్చారు.

News September 16, 2024

తొలి వందే మెట్రోను ప్రారంభించిన మోదీ

image

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తొలి వందే మెట్రోను ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య ఈ రైలును ‘నమో భారత్ రాపిడ్ రైలు’గా వర్ణించారు. దీంతో పాటు వర్చువల్‌గా పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్‌కు 2 ట్రైన్లు ఉన్నాయి. మరో మూడు కొల్లాపూర్-పుణే, హుబ్బళ్లి-పుణే, ఆగ్రా-బనారస్ మధ్య నడవనున్నాయి.

News September 16, 2024

ఇదే సరైన సమయం.. బయటకు రండి: విశాల్

image

సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కోరారు. బయటకొచ్చి మాట్లాడితే అవకాశాలు రావనే ఆలోచనలో ఉండొద్దన్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై బాలీవుడ్‌ నుంచి స్పందన లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అది అక్కడ పని చేసే మహిళలపై ఆధారపడి ఉంటుంది. బాధితులు నిజాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం’ అని అన్నారు.