news

News March 16, 2024

రేపు కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్‌రావు

image

TG: లిక్కర్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కలవనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఆ సమయంలోనే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు, న్యాయవాదులు కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

News March 16, 2024

ఇక సెలవు.. 125 ఏళ్ల తాబేలు మృతి

image

HYDలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసు గల రాక్షసుడు అనే మగ తాబేలు ప్రాణాలు విడిచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. 10 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని జూ అధికారులు తెలిపారు. 1963లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలును జూపార్క్‌కు తరలించగా.. అప్పట్నుంచి ఇక్కడే ఉంది. ఇన్నేళ్ల పాటు దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. తాబేళ్ల జీవితకాలం 80-150 ఏళ్లు.

News March 16, 2024

మోదీపై విమర్శలు బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి: అబ్దుల్లా

image

ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శలతో వాటికే నష్టం వాటిల్లుతోందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండియా టుడే కాంక్లేవ్‌లో వ్యాఖ్యానించారు. ‘బహుశా మోదీకి టెఫ్లాన్‌ పూత ఉందేమో. ప్రతిపక్షాలు మోదీపై ఏ విమర్శలు చేసినా అవి బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి. ఆయన్ని టార్గెట్ చేసుకోవడమే మనం చేస్తున్న తప్పు. ‘కాపలాదారు దొంగ, అంబానీ, అదానీ’ వంటి విమర్శలతో ఇక పనికాదు. అనుభవంతో చెప్తున్నా’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

BREAKING: ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు

image

ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీకి 11.566 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఏపీ వాటా కింద 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు వచ్చింది. తెలంగాణకు శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది.

News March 16, 2024

BRSకు ఆరూరి రమేశ్ రాజీనామా

image

TG: బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, BRS వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాగా ఇటీవల ఆరూరి విషయంలో BJP, BRS నాయకుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను కలిసిన తర్వాత తాను పార్టీలో ఉంటానని చెప్పిన రమేశ్.. ఇవాళ రాజీనామా చేశారు.

News March 16, 2024

20న వైసీపీ మేనిఫెస్టో విడుదల!

image

AP: వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.

News March 16, 2024

రాడిసన్ పబ్‌లో ఏం జరిగిందంటే..: నిహారిక

image

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రాడిసన్ పబ్‌పై పోలీసుల దాడిలో నటి కొణిదెల నిహారిక అరెస్టయ్యారు. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆరోజు స్కూల్ ఫ్రెండ్స్‌ అందరూ అక్కడ కలుసుకున్నాం. సౌండ్ ఎక్కువ ఉందని మధ్యలోనే బయటికి వచ్చే సమయానికి అక్కడ పోలీసులు ఉన్నారు. తర్వాతే తెలిసింది ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని. కానీ నా మీద కూడా కథనాలు వచ్చాయి’ అని వివరించారు.

News March 16, 2024

IPL-2024: దూరమైన ఆటగాళ్లకు వీరే..

image

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, పలు జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలు, ఇతర కుటుంబ కారణాలతో కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. షమీ(GT), మార్క్‌వుడ్(LSG), ప్రసిద్ధ్ కృష్ణ(RR), జేసన్ రాయ్, గుస్ అట్కిన్‌సన్(KKR), హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి(DC), డెవాన్ కాన్వే(CSK) ఈ సీజన్‌లో ఆడట్లేదు. అలాగే CSK స్టార్ పేసర్ పతిరణ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.

News March 16, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

దేశంలో ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ ఉండనుంది. ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులు. జాబితాలో పేరుండి, ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోండి. మీ పేరు చెక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. పేరు లేకుంటే వెంటనే ఫాం-6 ద్వారా ఓటుకు దరఖాస్తు చేసుకోండి.

News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.