India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందేనని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చిచెప్పారు. వారితో పాటు కాంట్రాక్టు సిబ్బంది కూడా ఎన్నికల విధులు నిర్వర్తించరాదని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ కూడా అదే విషయాన్ని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని మాత్రం ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంకు వేసేందుకు మాత్రమే వారిని వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
TS: గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్లు TSPSC ప్రకటించింది. మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు మార్చి 23వ తేదీ ఉ.10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మార్చుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
సగానికి తెగిపోయిన మనిషి చేతిని వీధికుక్క నోట కరుచుకుని తీసుకెళ్తున్న వీడియో వైరలవుతోంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ఆస్పత్రి ప్రాంగణంలో మనిషి చేతిని ఎత్తుకెళుతున్న వీధి కుక్కను చూసి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న వారు అరవడంతో చేతిని వదిలేసి కుక్క పారిపోయింది. అయితే, ఇది మార్చురీలో నుంచి తీసుకొచ్చిందా? లేక ఇంకెక్కడి నుంచైనా తెచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ను అమలు చేయడానికి ముందు మనం వన్ ఎలక్షన్- వన్ ఫేజ్ ప్రయత్నించగలమా?’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో నిర్వహించనున్నట్లు EC వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ ఇటీవల ఓ నివేదికను సమర్పించింది.
మాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు(రూ.190+ కోట్లు) సాధించిన మూవీగా చరిత్ర సృష్టించిన ‘మంజుమెల్ బాయ్స్’ తెలుగులోకి రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ కసరత్తు చేస్తోందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. లోతైన గుహలో జారిపడిన యువకుడిని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో వాస్తవ ఘటన ఆధారంగా మూవీ తెరకెక్కింది.
TG: లిక్కర్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కలవనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఆ సమయంలోనే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు, న్యాయవాదులు కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
HYDలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసు గల రాక్షసుడు అనే మగ తాబేలు ప్రాణాలు విడిచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. 10 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని జూ అధికారులు తెలిపారు. 1963లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలును జూపార్క్‌కు తరలించగా.. అప్పట్నుంచి ఇక్కడే ఉంది. ఇన్నేళ్ల పాటు దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. తాబేళ్ల జీవితకాలం 80-150 ఏళ్లు.
ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శలతో వాటికే నష్టం వాటిల్లుతోందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండియా టుడే కాంక్లేవ్‌లో వ్యాఖ్యానించారు. ‘బహుశా మోదీకి టెఫ్లాన్ పూత ఉందేమో. ప్రతిపక్షాలు మోదీపై ఏ విమర్శలు చేసినా అవి బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి. ఆయన్ని టార్గెట్ చేసుకోవడమే మనం చేస్తున్న తప్పు. ‘కాపలాదారు దొంగ, అంబానీ, అదానీ’ వంటి విమర్శలతో ఇక పనికాదు. అనుభవంతో చెప్తున్నా’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీకి 11.566 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఏపీ వాటా కింద 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు వచ్చింది. తెలంగాణకు శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది.
TG: బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, BRS వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాగా ఇటీవల ఆరూరి విషయంలో BJP, BRS నాయకుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను కలిసిన తర్వాత తాను పార్టీలో ఉంటానని చెప్పిన రమేశ్.. ఇవాళ రాజీనామా చేశారు.
Sorry, no posts matched your criteria.