news

News March 21, 2024

ధోనీకి షేక్ హ్యాండ్‌ ఇస్తూ రోహిత్ పోస్ట్

image

IPLలో ధోనీ, రోహిత్ విజయవంతమైన కెప్టెన్లు. CSKకు ధోనీ, MIకి రోహిత్ సుదీర్ఘ కాలం సారథులుగా సేవలందించి అత్యధిక ట్రోఫీలను గెలిపించారు. తాజాగా ధోనీ CSK కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాస్ సందర్భంగా ధోనీకి షేక్ హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను హిట్‌మ్యాన్ పోస్ట్ చేశారు. ‘ఇద్దరు లెజెండ్‌లను తొలిసారి ప్లేయర్లుగా చూడబోతున్నాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 21, 2024

ఏంటీ లిక్కర్ స్కాం?

image

ఆప్ సర్కార్ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఈ పాలసీని రూపొందించింది. 2022లో వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీ దీనిలో స్కామ్ జరిగిందని భావించి నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు అందజేశారు. అదే ఏడాది ఆయన CBI విచారణకు ఆదేశించారు. ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని భావించి ఈడీ కూడా దర్యాప్తులోకి ఎంట్రీ ఇచ్చింది.

News March 21, 2024

ఏ పార్టీనీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు: మనోజ్

image

ఓటు వినియోగంపై మంచు మనోజ్ చేసిన <<12888614>>వ్యాఖ్యలు<<>> చర్చనీయాంశంగా మారాయి. తాజాగా దీనిపై మనోజ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ పార్టీనీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకు సాగాలనేది తన ఉద్దేశమని తెలిపారు. లైవ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తాను మాట్లాడిన కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదని, అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసిందని పేర్కొన్నారు.

News March 21, 2024

వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్!

image

యూజర్లకు మరో సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్స్ మెసేజ్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చి అందించే దిశగా పరీక్షలు నిర్వహిస్తోంది. వాయిస్ మెసేజ్‌ను అర్థం చేసుకోలేకపోయే వారు, చెవిటివారికి ఇది ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను Android 2.24.7.8 వెర్షన్‌లో పరీక్షిస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది.

News March 21, 2024

సుప్రీంకోర్టుకు ఆప్ నేతలు?

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆప్ నేతలు అలర్ట్ అయ్యారు. అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీఎంను ప్రశ్నించేందుకు 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

News March 21, 2024

9 సార్లు విచారణకు డుమ్మా

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేతలకు ఈడీ వరుస షాకులిచ్చింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను గతేడాది విచారించింది. ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. 9 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టేసింది.

News March 21, 2024

లద్దాఖ్‌లో నిరసనలు.. 16వ రోజుకు నిరాహార దీక్ష!

image

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ కొన్ని రోజులుగా స్థానికులు నిరసన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ (గిరిజన హక్కుల పరిరక్షణ) పరిధిలోకి తేవాలనేది నిరసనకారుల డిమాండ్. కేంద్రంతో గతంలో చర్చలు విఫలం కావడంతో వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు.

News March 21, 2024

భర్తను అప్పుగా ఇస్తారా.. జ్యోతిక ఏమన్నారంటే

image

స్టార్ హీర్ సూర్య‌ భార్య జ్యోతికను ఓ అభిమాని వింత కోరిక కోరారు. భర్తతో దిగిన ఫొటోను జ్యోతిక నెట్టింట షేర్ చేశారు. ఆ పోస్టుకు ‘జ్యోతిక మేడమ్.. నువ్వు నేను ప్రేమ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మన్‌కు పెద్ద అభిమానిని’ అని కామెంట్ చేశారు. దీనికి ‘ఊప్స్.. అలాంటిదేం కుదరదు’ అని జ్యోతిక రిప్లై ఇచ్చారు.

News March 21, 2024

ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు: నాగబాబు

image

AP: జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ కన్ఫ్యూషియస్ కోట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ‘ఏం మాట్లాడినా మా గురించేనేమోనని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నా ఉద్దేశాలను చెపుతున్నానే కానీ.. ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు’ అని వివరణ ఇచ్చారు. తాను చెప్పింది జీవిత సత్యమని తెలిపారు.

News March 21, 2024

నెక్ట్స్ టార్గెట్ కేజ్రీవాల్?

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఇక నెక్ట్స్ టార్గెట్‌ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.