India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. గంటా, ఆయన బంధువులు కలిసి బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.390.7 కోట్ల రుణం చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. పద్మనాభం మండలం అయినాడ వద్ద గంటాకు చెందిన స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే నెల 16న వేలం వేయనున్నట్లు వెల్లడించింది.
ఎలక్టోరల్ బాండ్ దాతల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలే ఉండటం చర్చనీయాంశమైంది. వీటిలో ఉత్తరాఖండ్‌లో ఇటీవల కూలిన సిల్క్‌యారా-బార్కోట్ టన్నెల్ నిర్మాత నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ 2019 ఏప్రిల్ నుంచి 2022 అక్టోబరు మధ్య రూ.55కోట్లు విలువైన బాండ్లు కొని చేసి బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఇక అదే ఏడాది టన్నెల్ నిర్మాణ పూర్తికి డెడ్‌లైన్ ఉండగా అది కేంద్రం పొడిగించడం గమనార్హం.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్-భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్‌లో నూతన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది. అస్సాంలోని కోక్రాజర్, బెంగాల్‌లోని బనర్‌హట్ నుంచి భూటాన్‌కు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. 2019-2024 మధ్య రూ.5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న ఐదేళ్లకు దానిని డబుల్ (రూ.10వేలకోట్లు) చేసింది.
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి ఫలితాలు సాధించడం ఏంటీ? ఇందుకు భారత ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి’ అని ఆయన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, IFCకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
TG: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మేయర్‌తోపాటు ఆమె తండ్రి, BRS నేత కే కేశవరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో చర్చలు జరిపినట్లు టాక్.
బోర్‌గా ఫీలవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఫోన్‌ను పక్కనపెట్టి క్రియేటివిటీపై దృష్టి పెట్టాలంటున్నారు. మీలో కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేసేందుకు ఇది దోహదపడుతుందని, బోర్‌గా అనిపించినప్పుడు ఇతరులతో మాట్లాడటం వల్ల కమ్యూనికేషన్ పెరిగి బంధాలు బలపడతాయని అంటున్నారు. ఏ పని లేనప్పుడు శరీరంతో పాటు మైండ్‌కు విశ్రాంతి దొరుకుతుందని, ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
IPL 2024 టైటిల్ విజేతగా సీఎస్కే జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
AP: టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగించారు. పొత్తులో జరిగిన సర్దుబాట్లను అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. బాబు బుజ్జగింపుతో రాజా మెత్తబడ్డారు. మరోవైపు బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా బాబును కలిశారు. కాగా తెనాలి సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో ఆలపాటికి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ఎసరు అనే వాదనలో నిజమెంతో పక్కనపెడితే రాజకీయ పార్టీలు బాగా లాభపడుతున్నాయి. ఎన్నికల వేళ ఏఐని ఆయుధంలా వాడుకుంటున్నాయి. డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్‌లతో ప్రచారం చేసుకుంటున్నాయి. తమ పార్టీ గురించి పాజిటివ్‌గా ప్రచారం చేయాలన్నా, పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా ఏఐకి పనిచెప్తున్నారు. BJP, కాంగ్రెస్, DMK, AIADMK వంటి ప్రధాన పార్టీలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి.
తమిళనాట దివంగత నేత కరుణానిధిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఆయనతో DMK ప్రచారం చేసుకుంది. రెండుగా చీలిన AIADMKలో పళనిస్వామి వర్గం తమకే ఓటేయాలని దివంగత నేత, ఆ పార్టీ మాజీ చీఫ్ జయలలితనే దింపింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేతలపై BJP, ప్రధాని మోదీపై కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలను షేర్ చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వాయిస్ క్లోనింగ్‌తో వారి పేర్లు పలికి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి.
Sorry, no posts matched your criteria.