India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. CA ఇంటర్ కోర్సు గ్రూప్-1 పరీక్షలు మే 3, 5, 9న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 11, 15, 17న నిర్వహించనున్నట్లు ICAI ప్రకటించింది. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో గ్రూప్-1 పరీక్షలు మే 2, 4, 8న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 10, 14, 16న నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలను www.icai.org వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
AP: తనను పిఠాపురంలో పోటీ చేయాలని ఎక్కువ మంది కోరడంతోనే బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘నన్ను అసెంబ్లీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా. ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు. అలాంటిది నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్లతో పాటు ‘సూపర్ సీనియర్లు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరు 1952లో దేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక్క యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోనే 1049 మంది ఈ ‘సూపర్ సీనియర్’ ఓటర్లు ఉన్నారట. వీరి వయసు 100-120ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో 414 మంది ఓటర్లు పురుషులు కాగా 440 మంది మహిళలు ఉండటం విశేషం.
వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్తారు. ఇండియాలో సమ్మర్ వెకేషన్ ప్రాంతాలు చాలానే ఉన్నా.. ఊటీ, కొడైకెనాల్, గ్యాంగ్‌టక్, కశ్మీర్, చిరపుంజి, సిమ్లా పర్యాటక ప్రదేశాలు చాలా ఫేమస్. అక్కడి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఆయా ప్రదేశాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.
AP: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలిచి తీరుతానని వైసీపీ అభ్యర్థి వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. పవన్ కాపు అయితే.. తాను కూడా కాపు ఆడపడుచునే అని అన్నారు. ‘కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు. ప్రతి వర్గాన్నీ అభివృద్ధి చేయాలనేదే లెక్కగా ఉండాలి. కాపులంతా వంద శాతం నాకు సహకారం అందిస్తారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది’ అని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె అందులో కోరారు. కాగా ఇటీవల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈనెల 23 వరకు కస్టడీ విధించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) వాయిదా పడింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రిలిమ్స్ పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఇది వరకు మే 26, 2024న ప్రిలిమ్స్ ఉంటుందని ప్రకటించిన యూపీఎస్సీ.. తాజాగా దాన్ని జూన్ 16, 2024కు వాయిదా వేసింది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను మే 26 నుంచి జూన్ 16కు పోస్ట్‌పోన్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలోని సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారైంది. వర్కింగ్ టైటిల్ RC16తో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు ఉదయం 10.10 గంటలకు జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా జాన్వీకపూర్ నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు.
AP: పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు అందించారు.
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతనం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెంపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.