News March 19, 2024

నేను కూడా కాపు ఆడపడుచునే: వంగా గీత

image

AP: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలిచి తీరుతానని వైసీపీ అభ్యర్థి వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. పవన్ కాపు అయితే.. తాను కూడా కాపు ఆడపడుచునే అని అన్నారు. ‘కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు. ప్రతి వర్గాన్నీ అభివృద్ధి చేయాలనేదే లెక్కగా ఉండాలి. కాపులంతా వంద శాతం నాకు సహకారం అందిస్తారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది’ అని అన్నారు.

Similar News

News September 14, 2024

INSPIRATION: ఒకప్పుడు గిన్నెలు కడిగి.. ఇప్పుడు ఎమ్మీ హోస్ట్‌గా..

image

ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌ను హోస్ట్ చేయనున్న ఫస్ట్ ఇండియన్‌గా అవతరించారు. డెహ్రాడూన్‌లో పుట్టిన వీర్ దాస్ USలో చదివేటప్పుడు ఖర్చుల కోసం వీధుల్లో గిటార్ వాయించేవారు. డిష్ వాషర్‌, డోర్‌మ్యాన్‌గానూ చేశారు. డబ్బుల్లేక ATM సెంటర్ల ముందు నిల్చొని కన్నీళ్లు పెట్టుకునేవారు. దాదాపు 20ఏళ్లకు ఎమ్మీ అవార్డ్స్‌ను హోస్ట్ ఛాన్స్ కొట్టేసి నిజమైన టాలెంట్‌ను ఎవరూ ఆపలేరని నిరూపించారు.

News September 14, 2024

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.440 పెరిగి రూ.74,890కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.68,650 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.2,000 పెరిగి రూ.97వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 14, 2024

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్

image

APలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, MPTCలకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు వరదలతో ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.