news

News March 18, 2024

మూడో ప్రపంచయుద్ధంపై పుతిన్ హెచ్చరిక

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరని అన్నారు. ‘ఉక్రెయిన్‌కు నాటో సైన్యం చేరుకున్నట్లు గుర్తించాం. వారికి ఇది మంచిది కాదు. భారీ సంఖ్యలో కన్నుమూస్తారు’ అని హెచ్చరించారు.

News March 18, 2024

రెండో రోజు కవిత ఈడీ విచారణ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ్టి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.

News March 18, 2024

చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడేవాడిని: అశ్విన్

image

ఓ దశలో క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నానని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఓసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవైనప్పుడు ఆయన ‘నీకు నిజాయతీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావ్’ అని అనేశారు. సాధారణంగా ఎప్పుడూ అంత బాధపడను. కానీ అప్పుడు గదిలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చాను. కొంతకాలం అలా చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడ్డాను” అని తెలిపారు.

News March 18, 2024

పెళ్లి చేసుకున్న హీరోయిన్

image

‘గుడ్ నైట్’ సినిమా‌తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్ మీతా రఘునాథ్ పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరగగా, తాజాగా ఏడడుగులు వేశారు. ఈ ఫొటోలను మీతా ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అయితే భర్త పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. కాగా ముదుల్ నీ ముదివమ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీతా.. ‘గుడ్ నైట్’తో మంచి పేరు సాధించారు.

News March 18, 2024

అంబానీ వేడుకలో చోరీకి యత్నం!

image

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్లో ఇటీవల ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ ఈవెంట్‌కు వెళ్లలేకపోవడంతో జామ్‌నగర్‌లోని కొన్ని కార్ల అద్దాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఆరుగుర్ని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

News March 18, 2024

సచివాలయాల్లో సర్టిఫికెట్ల జారీ నిలిపివేత

image

AP: ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆయా ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చే వరకు జారీ చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయ్యింది.

News March 18, 2024

మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ నిరాకరణ

image

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం కొనసాగుతోంది. DMK నేత పొన్ముడిని మంత్రిగా నియమించాలంటూ CM స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. అవినీతి కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన మూడేళ్ల శిక్షపై సుప్రీం స్టే విధించడంతో ఆయన సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. దీంతో పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించాలంటూ CM లేఖ రాయగా, కేసును కొట్టేయనందున తిరస్కరిస్తున్నట్లు రవి స్పష్టం చేశారు.

News March 18, 2024

బెట్టింగ్ యాప్ కుంభకోణం.. మాజీ సీఎంపై కేసు

image

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు గతంలో ఆరోపించిన ఈడీ.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీ నమోదు చేసిన రాజకీయ వేధింపు కేసు అని బఘేల్ ఆరోపించారు.

News March 18, 2024

సింగర్ మంగ్లీ కారు ప్రమాదంపై పోలీసులు ఏమన్నారంటే?

image

రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని తెలిపారు.

News March 18, 2024

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు

image

ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ వెల్లడించింది. ‘కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీసులు ఎందుకు పంపారు? ఈడీ సమన్లు చట్టవిరుద్ధం’ అని ప్రకటనలో పేర్కొంది.