News March 18, 2024
ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ వెల్లడించింది. ‘కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీసులు ఎందుకు పంపారు? ఈడీ సమన్లు చట్టవిరుద్ధం’ అని ప్రకటనలో పేర్కొంది.
Similar News
News October 6, 2024
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.
News October 6, 2024
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 6, 2024
డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి
TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.