news

News March 21, 2024

ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా సుబియాంటో

image

ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో పదవీ కాలం ముగియడంతో సుబియాంటో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. కాగా సుబియాంటోకు 58.6 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి అనీస్ బస్వేదర్‌కు 24.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గత నెల 14న ఎన్నికలు జరగగా ఇప్పుడు ఫలితాలు వెల్లడయ్యాయి.

News March 21, 2024

మూడేళ్లు ఆగితేనే మూడు ముళ్లు.. ఎక్కడో తెలుసా?

image

పెళ్లిళ్లు అన్ని చోట్ల ఒకేలా జరగవు. వేర్వేరు చోట్ల వేర్వేరు సంప్రదాయాలు ఉంటాయి. శ్రీకాకుళంలోని నువ్వుల రేవు గ్రామంలో పెళ్లి జరగాలంటే యువతీ, యువకులు మూడేళ్లు ఆగాల్సిందే. ఒకేసారి ఇక్కడ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ఇక్కడ అబ్బాయికి అమ్మాయి తాళి కట్టే వింత ఆచారం ఉంది. నల్ల కళ్లద్దాలు, డబ్బులతో వధూవరులను అలంకరిస్తారు. ఆ సమయంలో ఊరిలో పండగ వాతావరణం నెలకొంటుంది. వేరే ఊరి వారిని ప్రేమించడం ఇక్కడ నిషేధం.

News March 21, 2024

IPL: LSGకి బిగ్ షాక్

image

రేపు ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుండగా లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. కొద్ది రోజులు కుటుంబంతో గడిపిన అనంతరం ఆయన ఐపీఎల్‌లో ఆడనున్నారు. కాగా ఇప్పటికే మార్క్ వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి గైర్హాజరీతో లక్నో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

News March 21, 2024

రామ్ చరణ్ ఇంట్లో జాన్వీ కపూర్ సందడి

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సందడి చేశారు. ఆమెతోపాటు బోనీ కపూర్, సుకుమార్, బుచ్చిబాబు కూడా చెర్రీ నివాసంలో కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రామ్ చరణ్, జాన్వీ జంటగా ‘RC16’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

News March 21, 2024

ఆ వీడియోల గుర్తింపు యూట్యూబ్‌లో ఇక సులువు

image

AI పుణ్యమా అని ఏది అసలు వీడియోనో.. ఏది ఆర్టిఫిషియల్ వీడియోనో గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యూజర్లు అసలైన కంటెంట్, ఏఐతో రూపొందించిన వీడియోకు మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏఐ ద్వారా ఏమైనా క్రియేట్ చేస్తే ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తులు వెల్లడించాలి. దీని కోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ తీసుకొచ్చామంది.

News March 21, 2024

మహ్మద్ షమీ కొత్త అవతారం

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కొత్త అవతారం ఎత్తనున్నారు. క్రిక్‌బజ్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌‌లో షమీ చోటు దక్కించుకున్నారు. క్రిక్‌బజ్ నిర్వహించే చర్చల్లో ఆయన విశ్లేషకులుగా ఉండనున్నారు. మాజీ క్రికెటర్లు, కామేంటేటర్లతో కలిసి ఆయన చర్చించనున్నారు. కాగా షమీ కాలి చీలమండ గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News March 21, 2024

మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా కోహ్లీ

image

దేశంలోనే మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచినట్లు ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. అతడి తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, క్రిస్టియానో రొనాల్డో, సచిన్, లియోనల్ మెస్సీ, నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రీ నిలిచారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్‌గా క్రికెట్ నిలిచింది. క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, హాకీ ఉన్నాయి.

News March 21, 2024

రైలు దొంగలు.. దేనినీ వదలరు

image

రైళ్లలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చోరీలకు పాల్పడుతూ భారత రైల్వేకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఏడాది వ్యవధిలో ₹2.5cr విలువ చేసే వస్తువులను చోరీ చేసినట్లు సమాచారం. 2లక్షల తువాళ్లు, 55వేల పిల్లో కవర్లు, 81వేల బెడ్‌షీట్లు, 7వేల దుప్పట్లు, వెయ్యి ట్యాప్‌లు, 200 టాయిలెట్ మగ్గులు, 300 ఫ్లష్ పైపులను చోరీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో రోజూ సుమారు 13,169 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.

News March 21, 2024

మార్చి 21: చరిత్రలో ఈ రోజు

image

1857: జపాన్‌లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: హీరోయిన్ శోభన జననం
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం

News March 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.