News March 21, 2024
రైలు దొంగలు.. దేనినీ వదలరు
రైళ్లలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చోరీలకు పాల్పడుతూ భారత రైల్వేకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఏడాది వ్యవధిలో ₹2.5cr విలువ చేసే వస్తువులను చోరీ చేసినట్లు సమాచారం. 2లక్షల తువాళ్లు, 55వేల పిల్లో కవర్లు, 81వేల బెడ్‌షీట్లు, 7వేల దుప్పట్లు, వెయ్యి ట్యాప్‌లు, 200 టాయిలెట్ మగ్గులు, 300 ఫ్లష్ పైపులను చోరీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో రోజూ సుమారు 13,169 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.
Similar News
News September 10, 2024
జననాల రేటు పెంచేందుకు కిమ్ ఏం చేశారంటే?
ఉత్తర కొరియాలో జననాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అబార్షన్లు చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ కొందరు వైద్యులు రహస్యంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇలా చేయకుండా ఉండేందుకు వైద్యుల జీతాలను భారీ పెంచారు. కానీ కొందరు మారకపోవడంతో దొరికిన వైద్యులకు జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా ఎక్కువ మంది పిల్లలున్న వారికి గృహాలు, ఆహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
News September 10, 2024
నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు
TG: పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను BRS ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.
News September 10, 2024
ఆటో డ్రైవర్ నిజాయితీ.. డైమండ్ నెక్లెస్ తిరిగిచ్చాడు!
విలువైన వస్తువులు కోల్పోతే అవి దొరకడం కష్టమే. అయితే, హరియాణాలోని గురుగ్రామ్‌లో రూ.లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ఉన్న బ్యాగ్‌ను ఓ మహిళ ఆటోలో మరిచిపోయింది. అందులో విలువైన వస్తువులు కూడా ఉండటంతో మహిళ ఆందోళన చెందింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కొద్దిసేపటికే బ్యాగ్ మరిచిపోయారంటూ డ్రైవర్ ఇంటికి రావడంతో ఆ మహిళ ఖుషీ అయింది. డ్రైవర్ నిజాయితీని అభినందిస్తూ చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరలవుతోంది.