India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల/కమల్ మౌలా మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వే చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు 12 మంది సభ్యులతో కూడిన ASI బృందం సర్వే చేస్తోంది. వాగ్దేవి దేవత ఆలయమని హిందువులు విశ్వసించే ఈ భోజ్‌శాల కాంప్లెక్స్‌పై సర్వే నిర్వహించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు BJP చీఫ్ అన్నామలై గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం, ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు అన్నామలైకు ఉండటం పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇటీవల ఇక్కడ PM పర్యటించడం, 1998 బాంబు బ్లాస్ట్‌లో చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం కూడా ప్లస్ అవ్వొచ్చని భావిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. రెండ్రోజులుగా ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఈరోజు ఉదయమే ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. రింగుల జుట్టుతో మెరున్ షర్టు ధరించిన తారక్ లుక్ ఆకట్టుకుంటోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఫ్రాడ్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై కేంద్ర టెలికం శాఖ చక్షు పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఏ రూపంలో కాల్ వచ్చింది? కేటగిరీ, తేదీ, టైం, స్క్రీన్‌షాట్ సహా పలు అంశాలతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేందుకు ఇక్కడ <
AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.
BRS సీనియర్ నేత మాజీ ఎంపీ కే కేశవరావు, HYD మేయర్ విజయలక్ష్మీ BRSకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో వీరు చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. త్వరలోనే సీఎం రేవంత్‌ని కలిసి పార్టీ మార్పుపై చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కే కేశవరావు ఇంటికి మున్షీ వచ్చినట్లు సమాచారం.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిన్న <<12896936>>రికార్డు<<>> స్థాయిలో పెరగగా, ఇవాళ అదే స్థాయిలో తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.61,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.66,930 పలుకుతోంది. కేజీ వెండి ఏకంగా రూ.2,000 తగ్గి రూ.79,500కు చేరింది.
AP: మొత్తం 3 విడతల్లో అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన TDP.. 4 ఎంపీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. విజయనగరం సీటు తీసుకుని బీజేపీకి రాజంపేట స్థానం కేటాయించడంపై చర్చలు నడుస్తుండగా.. కడప విషయంలో శ్రీనివాసులురెడ్డి/వీరశివారెడ్డి, ఒంగోలులో మాగుంట కుటుంబంలో పోటీపై చర్చ, అనంతపురంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఇక ఎచ్చెర్ల, భీమిలి, చీపురుపల్లి సహా మరో 2 అసెంబ్లీ స్థానాలపై బీజేపీతో స్పష్టత రావాల్సి ఉంది.
AP: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి కేశినేని నాని, TDP తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ TDP గెలిచిన MP సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.
ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా నచ్చినట్లుగా ముగ్గురు ఫ్రెండ్స్ చేసే సిల్లీ పనులే ‘ఓం భీమ్ బుష్’ కథ. తమ కామెడీ టైమింగ్స్‌తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అలరించారు. శ్రీవిష్ణు పంచ్‌లు, బాడీ లాంగ్వేజ్, హర్రర్ సీన్స్, కీలక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా.. స్టోరీ లైన్, లాజిక్ లేని సీన్స్, మ్యూజిక్, ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్ర, స్క్రీన్‌ప్లే మైనస్.
RATING: 2.50/5
Sorry, no posts matched your criteria.