News March 22, 2024

పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..

image

AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Similar News

News September 9, 2024

ప్రకాశం బ్యారేజ్ బోట్ల కేసు.. నిందితుడు లోకేశ్ సన్నిహితుడే: వైసీపీ

image

AP: వరదల్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు బోట్లు కొట్టుకొచ్చిన కేసు నిందితుడు మంత్రి లోకేశ్ సన్నిహితుడేనని YCP ఆరోపించింది. ‘ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను CBN ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారు. రామ్మోహన్ TDP ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు బంధువు. ఉషాద్రికి లోకేశ్‌తో సంబంధాలున్నాయనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం. వరద బాధితుల కోపాన్ని డైవర్ట్ చేయడానికి TDP ప్రయత్నిస్తోంది’ అని ట్వీట్ చేసింది.

News September 9, 2024

BREAKING: తీరం దాటిన వాయుగుండం

image

AP: ఉత్తరాంధ్రను వణికిస్తోన్న తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఉండనుంది. వాయుగుండం క్రమేపి బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

News September 9, 2024

ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు 2,000 మంది పోలీసులు

image

ఫిలిప్పీన్స్‌లో అపోలో అనే పాస్టర్ దావోవ్ సిటీలో 75ఎకరాల్లో ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట ఓ సామ్రాజ్యం స్థాపించారు. సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు వ్యక్తిగత సహాయకులనూ లైంగికంగా వేధించారని అభియోగాలున్నాయి. దీంతో దాదాపు 2వారాల ఆపరేషన్ తర్వాత ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 2,000 మంది పోలీసులు ఓ బంకర్‌లో దాక్కొన్న అపోలోను అరెస్ట్ చేశారు. హెలికాప్టర్లను కూడా వాడారు.