news

News March 20, 2024

అతడి కోసం తూటాకైనా అడ్డునిలబడతా: గంభీర్

image

నెదర్లాండ్స్ ఆటగాడు ర్యాన్ టెన్ డొషేటేపై KKR మెంటార్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘నా కెరీర్‌ మొత్తంలో నేను చూసిన అత్యంత నిస్వార్థమైన ఆటగాడు ర్యాన్‌ టెన్ డొషేటేనే. 2011లో కేకేఆర్ కెప్టెన్‌గా నా తొలి గేమ్‌లో తనను పక్కన పెట్టాను. అయినా సరే ఏమాత్రం భేషజం లేకుండా నవ్వుతూ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించాడు. నిస్వార్థాన్ని తనే నాకు నేర్పాడు. అతడి కోసం నేను తూటాకైనా అడ్డు నిలబడతాను’ అని వెల్లడించారు.

News March 20, 2024

షాకింగ్: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ ఇదేనా..?

image

శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోంది ‘గేమ్ ఛేంజర్. మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా స్టోరీని అమెజాన్ ప్రైమ్ తాజాగా రివీల్ చేసింది. పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ అని చెప్పింది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చెర్రీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ దీనిలో తండ్రీకొడుకులుగా కనిపించనున్నట్లు టాక్.

News March 20, 2024

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌కు జీవితఖైదు

image

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు, ముంబై మాజీ పోలీస్ ప్రదీప్ శర్మకు బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. మాఫియా డాన్ చోటారాజన్ అనుచరుడు రామ్‌నారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా ఫేక్ ఎన్‌కౌంటర్‌‌ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. చోటా రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, D-కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిక్ తదితరులను హతమార్చి ప్రదీప్ గుర్తింపు పొందారు. తాను 112 మంది గ్యాంగ్‌స్టర్లను హతమార్చినట్లు గతంలో ప్రదీప్ పేర్కొన్నారు.

News March 20, 2024

తెలియని వారి పెళ్లిళ్లకు వెళ్లి లాగించేస్తున్నారా?

image

నోరూరించే వంటకాలను లాగించేయొచ్చని కొంతమంది తెలియని వారి పెళ్లి వేడుకల్లోకి చొరబడిపోతుంటారు. కడుపారా అన్ని ఐటమ్స్ లాగించి కామ్‌గా బయటకొస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ పట్టుబడితే? కొందరైతే మందలించి వదిలేస్తారు లేదంటే.. మీ మీద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది! అవును పోలీస్ కంప్లైంట్ ఇస్తే IPC సెక్షన్ 441 ‘క్రిమినల్ ట్రెస్‌పాస్’ కింద మీకు 3 నెలల జైలు/ రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

News March 20, 2024

ఢిల్లీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో HYD వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు బెయిల్ మంజూరైంది. అతనికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన 5 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని, పాస్‌ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

News March 20, 2024

ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే?

image

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడారి పోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.

News March 20, 2024

తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్

image

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

News March 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా చర్యలు తప్పవంది. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు అందితే తగిన చర్యలు చేపడతామంది.

News March 20, 2024

పిఠాపురంలో జనసేనకు షాక్

image

AP: పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గత కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న ఆమె.. వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె వెళ్లినా తమకు ఇబ్బంది లేదని.. పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసైనికులు చెబుతున్నారు.

News March 20, 2024

ఘోర ప్రమాదం.. 14 మంది మృతి

image

ఉత్తర చైనాలోని ఓ ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్‌లో బస్సు ప్రమాదానికి గురై 14 మంది ప్రాణాలు కోల్పోగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి టన్నెల్ గోడకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఈ ఘటనపై అధికారులు నేడు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.