News March 20, 2024
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్
శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Similar News
News September 15, 2024
773 చోట్ల గండ్లు.. 2 పంప్‌హౌస్‌ల మునక: నీటిపారుదల శాఖ
TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా 773 చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడినట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్, భక్త రామదాసు ఎత్తిపోతల పథకంలోని పంప్ హౌస్ మునిగిపోయాయని తెలిపింది. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక అందించింది.
News September 15, 2024
నెలాఖరులోగా ‘నామినేటెడ్’ భర్తీ!
AP: భారీ వర్షాలు, వరదలతో వాయిదా పడిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే 80% పోస్టులపై కసరత్తు పూర్తవగా, మిగతా వాటిపై కూటమి నేతలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. TDP, JSP, BJPలకు 60:30:10 రేషియోలో పంపకాలు ఉంటాయని సమాచారం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తవుతుందని, గత ప్రభుత్వంపై పోరాటం, కూటమి గెలుపు కోసం కీలకంగా పనిచేసినవారికే ప్రాధాన్యత ఉంటుందని కూటమి వర్గాలు తెలిపాయి.
News September 15, 2024
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
AP: ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. OCT 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.