India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు WPL విజేతగా నిలిచింది. తొలిసారి ఈ జట్టు కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఆర్సీబీ గెలవగానే ఆ జట్టు పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో RCB పురుషుల జట్టు ట్రోఫీ గెలిస్తే అది అద్భుతమైన డబుల్ ధమాకా అవుతుంది. గుడ్ లక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం మార్చి 24న సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. థియేటర్, OTTల్లో సక్సెస్ అయిన మూవీకి బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో CUET-UG పరీక్షలు వాయిదా పడతాయన్న వార్తలను UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఖండించారు. గతంలో ప్రకటించిన విధంగానే మే 15 నుంచి 31 మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26న దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంత మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారనే డేటాను విడుదల చేస్తామన్నారు. గత ఏడాది ఈ పరీక్షకు 14.9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
ఆర్సీబీ మహిళల జట్టు WPL సీజన్-2లో టైటిల్ గెలవడంతో పురుషుల జట్టుపై ఫ్యాన్స్‌కు ఆశలు పెరిగాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్ ఆరంభం నుంచి వినిపించే ‘ఈ సాలా కప్ నమ్దే’ ఈసారి నిజమవుతుందటూ ఆర్సీబీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2008 నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ట్రోఫీని ముద్దాడుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22న జరిగే ఐపీఎల్-2024 సీజన్ ఆరంభ పోరులో CSKతో ఆర్సీబీ తలపడనుంది.
TG: రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50వేలు, మిరప తోటలకు ఎకరాకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు జలకళతో కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని చెప్పారు.
WPL సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31), ఎల్లిస్ ఫెర్రీ(35*) రాణించారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) మినహా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మొలినిక్స్ 3, శోభనా ఆశా 2 వికెట్లు పడగొట్టారు.
పరిమితంగా ఉంటే అలవాటు. పరిధి దాటితే వ్యసనం. అలవాట్లు ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. వ్యసనంగా మారే ఏదైనా ప్రమాదమే. నీలిచిత్రాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒకస్థాయి తర్వాత మెదడు ఉద్వేగరహిత స్థాయికి చేరి మొద్దుబారిపోతుందంటున్నారు. ‘పోర్న్ వ్యసనంతో శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. దాంపత్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని నిపుణులు వారిస్తున్నారు.
AP: సీఎం జగన్, చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించి ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? ఐదేళ్లుగా జగన్‌తో తెరచాటు స్నేహం నడిపారు. దత్తపుత్రుడు అన్నారు. జగన్ అరాచకాలకు అడ్డగోలు సహాయ సహకారాలు అందించి ఇప్పుడు కాంగ్రెస్ మీద పసలేని దాడులా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
TG: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన RS ప్రవీణ్‌కుమార్.. BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘నా రాజకీయ భవితవ్యంపై శ్రేయోభిలాషులతో చర్చించా. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రేపు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.