News March 17, 2024
IPLలోనూ గెలిస్తే డబుల్ ధమాకా: విజయ్ మాల్యా
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో RCB పురుషుల జట్టు ట్రోఫీ గెలిస్తే అది అద్భుతమైన డబుల్ ధమాకా అవుతుంది. గుడ్ లక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 14, 2024
తమిళనాడులో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుతో పాటు మరో 15 జిల్లాలకు అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 14, 2024
జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..
AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News October 14, 2024
న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం
AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.