news

News March 16, 2024

20న వైసీపీ మేనిఫెస్టో విడుదల!

image

AP: వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.

News March 16, 2024

రాడిసన్ పబ్‌లో ఏం జరిగిందంటే..: నిహారిక

image

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రాడిసన్ పబ్‌పై పోలీసుల దాడిలో నటి కొణిదెల నిహారిక అరెస్టయ్యారు. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆరోజు స్కూల్ ఫ్రెండ్స్‌ అందరూ అక్కడ కలుసుకున్నాం. సౌండ్ ఎక్కువ ఉందని మధ్యలోనే బయటికి వచ్చే సమయానికి అక్కడ పోలీసులు ఉన్నారు. తర్వాతే తెలిసింది ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని. కానీ నా మీద కూడా కథనాలు వచ్చాయి’ అని వివరించారు.

News March 16, 2024

IPL-2024: దూరమైన ఆటగాళ్లకు వీరే..

image

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, పలు జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలు, ఇతర కుటుంబ కారణాలతో కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. షమీ(GT), మార్క్‌వుడ్(LSG), ప్రసిద్ధ్ కృష్ణ(RR), జేసన్ రాయ్, గుస్ అట్కిన్‌సన్(KKR), హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి(DC), డెవాన్ కాన్వే(CSK) ఈ సీజన్‌లో ఆడట్లేదు. అలాగే CSK స్టార్ పేసర్ పతిరణ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.

News March 16, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

దేశంలో ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ ఉండనుంది. ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులు. జాబితాలో పేరుండి, ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోండి. మీ పేరు చెక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. పేరు లేకుంటే వెంటనే ఫాం-6 ద్వారా ఓటుకు దరఖాస్తు చేసుకోండి.

News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.

News March 16, 2024

ఉక్రెయిన్‌పై అణుదాడిని భారత్ ఆపిందా..?

image

ఉక్రెయిన్‌పై అణ్వస్త్ర దాడి జరగకుండా భారత్ ఆపిందా..? ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆయన దానికి పరోక్ష సమాధానం ఇచ్చారు. ‘పలు అంశాల్లో ఉద్రిక్తతల్ని, వివిధ పరిస్థితుల్ని మార్చేందుకు, తీవ్రతను తగ్గించేందుకు మేం ఏం చేయాలో అన్నీ చేశాం. చేస్తున్నాం. మేం చాలా అంశాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అయితే వాటిని మేం బయటపెట్టలేదు. రహస్యంగా ఉంచాం’ అని తెలిపారు.

News March 16, 2024

ఆటగాళ్ల పాస్‌పోర్ట్స్ తీసుకున్న ఐపీఎల్ జట్లు?

image

ఎలక్షన్స్ దృష్ట్యా ఐపీఎల్‌ రెండో దశ మ్యాచులను దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్టుల్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులుంటే ఈ చర్య ఉపకరిస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఈ 22న ఐపీఎల్ మొదలుకానుంది.

News March 16, 2024

25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలనివ్వండి: రేవంత్ రెడ్డి

image

APకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని TS CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది MLAలు, ఐదుగురు MPలను ఇవ్వండి చాలు. షర్మిలమ్మ పోరాటం చేస్తారు. ఎవరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎలా పోలవరం పూర్తికాదో, ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారు’ అని అన్నారు.

News March 16, 2024

ప్రణీత్‌రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

image

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.

News March 16, 2024

ఈవీఎంలపై ఫిర్యాదులను కోర్టులు 40సార్లు కొట్టేశాయి: సీఈసీ

image

ప్రతి ఎన్నికలో ఈవీఎంల పనితీరుపై పలువురు వ్యక్తం చేస్తోన్న అనుమానాలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ‘ఇలాంటి ఫిర్యాదులపై కోర్టులు 40సార్లు విచారణ చేశాయి. ప్రతిసారీ ఆరోపణలన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలు సరళతరం చేశాయి. అవే ఈవీఎంలతో అధికారంలో ఉన్న పార్టీలూ ఓడిపోయాయి’ అని గుర్తు చేశారు.