news

News March 16, 2024

మే 26న మనం కప్పు గెలుస్తున్నాం: గంభీర్

image

ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని KKR గెలవాల్సిందేనని ఆ జట్టు మెంటార్ గంభీర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశారు. ఆటగాళ్లతో ఆయన మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో కేకేఆర్ పంచుకుంది. ‘మీరు ఒక గొప్ప జట్టుకు ఆడుతున్నారు. మైదానంలో ఆ విషయం గుర్తుపెట్టుకుని గర్వంగా, స్వేచ్ఛతో ఆడండి. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు, అంతర్జాతీయ ఆటగాళ్లు, దేశవాళీ ఆటగాళ్లు అనే తేడా లేదు. మే 26న మనం కప్పు గెలుస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

2019లో ఓటర్ల సంఖ్య అలా.. ఇప్పుడిలా..!

image

ఓటర్ల వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, ప్రస్తుతం అది 96.8 కోట్లుగా ఉంది. ఇందులో పురుష ఓటర్లు 46.5 కోట్లు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 49.7 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు 47.1 కోట్లకు చేరింది. ఇక ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 39,683 నుంచి 48,044కు.. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షల నుంచి 88.35 లక్షలకు చేరింది.

News March 16, 2024

ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి ప్రవీణ్ కుమార్?

image

బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి చేరనున్నారని తెలుస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన ఈరోజు ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చర్చల అనంతరం నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

News March 16, 2024

81 స్థానాల్లో మార్పులు

image

AP: వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యే స్థానాల్లో 81 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చింది. అలాగే 18 మంది సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిలో పలువురిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేయగా మరికొంత మందికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దాదాపు 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామని.. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని సీఎం జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం టికెట్లు ఇచ్చామని చెప్పారు.

News March 16, 2024

దేశంలో 7 ఫేజుల్లో ఎన్నికలు.. ఎప్పుడెప్పుడు?

image

ఫేజ్ 1 : ఏప్రిల్ 19 (21 రాష్ట్రాలు)
ఫేజ్ 2 : ఏప్రిల్ 26 (13 రాష్ట్రాలు)
ఫేజ్ 3 : మే 7 (12 రాష్ట్రాలు)
ఫేజ్ 4 : మే 13 (ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు)
ఫేజ్ 5 : మే 20 (8 రాష్ట్రాలు)
ఫేజ్ 6 : మే 25 (7 రాష్ట్రాలు)
ఫేజ్ 7 : జూన్ 1 (8 రాష్ట్రాలు)

News March 16, 2024

తెలంగాణలో మే 13న ఎన్నికలు

image

ఏపీతో పాటు తెలంగాణలో <<12866845>>ఒకేరోజు<<>> ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

News March 16, 2024

11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్: ఈసీ

image

2022-23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ₹3,400 కోట్ల అక్రమ డబ్బును సీజ్ చేసినట్లు EC వెల్లడించింది. 2017-18తో పోలిస్తే 835% పెరిగినట్లు పేర్కొంది. గుజరాత్‌- ₹802 కోట్లు, తెలంగాణ-₹778 కోట్లు, రాజస్థాన్‌-₹704 కోట్లు, కర్ణాటక-₹384 కోట్లు, మధ్యప్రదేశ్‌-₹332 కోట్లు, మిజోరాం-₹123 కోట్లు, ఛత్తీస్‌గఢ్-₹78 కోట్లు, మేఘాలయ-₹74 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-₹57 కోట్లు, నాగాలాండ్-₹50 కోట్లు, త్రిపుర-₹45 కోట్లు.

News March 16, 2024

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు

image

☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
☞ నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25
☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26
☞ నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29
☞ ఎన్నికల తేదీ- మే 13
☞ ఎన్నికల కౌంటింగ్- జూన్ 4

News March 16, 2024

అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్

image

✒ నోటిఫికేషన్- మార్చి 20
✒ నామినేషన్లకు చివరి తేదీ- మార్చి 27
✒ నామినేషన్ల పరిశీలన- మార్చి 28
✒ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- మార్చి 30
✒ పోలింగ్- ఏప్రిల్ 19
✒ కౌంటింగ్- జూన్ 4

News March 16, 2024

సిక్కింలో ఏప్రిల్ 19న ఎన్నికలు

image

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.